GST Rate Hikes: Check What Will Become Expensive In Telugu - Sakshi
Sakshi News home page

GST Rate: జీఎస్టీ బాదుడు, మరింత ఖరీదుగా నిత్యావసర వస్తువులు!

Jun 30 2022 10:26 AM | Updated on Jun 30 2022 1:31 PM

Gst Rate Hikes Check What Will Become Expensive - Sakshi

రెండు రోజుల పాటు జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి నిర్ణయక మండలి 47వ సమావేశం ముగిసింది. చండీగఢ్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ కొత్త పన్ను రేట్లను విధించింది. విధించిన ఆ పన్ను రేట్లు జులై 18 నుంచి అమల్లోకి రానుండగా..ఏ వస్తువులపై ఎంత ట్యాక్స్‌ విధించారో తెలుసుకుందాం.     

♦ నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వంటింట్లో విరివిరిగా వినియోగించే ప్యాకింగ్‌,లేబుల్‌ వేసిన పాలు,పెరుగు, చేపలపై 5శాతం జీఎస్టీ, బ్యాంక్‌ ఖాతాదారులకు అందించే చెక్‌ బుక్‌లపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. 

♦వీటితో పాటు రూ.1000 కంటే తక్కువ ఉన్న హోటల్‌ గదులపై 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో హోటల్‌ రూమ్స్‌పై జీఎస్టీ లేదు. 

♦రూ.5వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న హాస్పిటల్‌ రూమ్స్‌లో ఉంటే వాటిపై 5శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంది. గతంలో హాస్పిటల్‌ రూమ్స్‌పై ఎలాంటి జీఎస్టీ లేదు. తాజాగా హాస్పిటల్‌ రూమ్స్‌ పై పన్ను వసూలు చేయడంపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

♦ఎండు చిక్కుళ్లు, మకనా, గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, సేంద్రీయ ఆహారం, కంపోస్ట్‌ ఎరువుపై 5 శాతం జీఎస్టీ

♦సోలార్‌ వాటర్‌ హీటర్‌,లెదర్‌ ప్రొడక్ట్‌లపై 5 శాతం నుంచి 12శాతం జీఎస్టీ పెంపు 

♦ప్రింటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌, ఎల్‌ఈడీ బల్బులు, డ్రాయింగ్‌ చేసేందుకు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్(ఉదా: డ్రాఫ్టింగ్‌ బోర్డ్‌, డ్రాఫ్టింగ్‌ మెషిన్‌, రూలర్స్‌, టెంప్‌లెట్స్‌, కంపాస్‌) బ్రేడ్లు,స్పూన్లు, ఫోర్క్‌లపై విధించే పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

తగ్గేవి ఇవే

♦ఆర్ధోపెడిక్‌ ఉపకరణాలపై 12నుంచి 5శాతానికి పన్ను తగ్గింపు  

♦ట్రాన్స్‌ పోర్ట్‌ గూడ్స్‌, రోప్‌ వేస్‌ పై 18శాతం నుంచి 5శాతానికి  కుదింపు 

♦ఇంధనం ధర కలిపి అద్దెకు తీసుకునే ట్రక్‌, సరుకు రవాణా వాహనాల అద్దెపై పన్ను తగ్గింపు 
 

చదవండి👉 సామాన్యులకు కేంద్రం భారీ షాక్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement