జీఆర్‌టీ జ్యువెలర్స్‌కి ప్రతిష్టాత్మక అవార్డు | GRT Jewellers wins Prestigious Award | Sakshi
Sakshi News home page

జీఆర్‌టీ జ్యువెలర్స్‌కి ప్రతిష్టాత్మక అవార్డు

Oct 9 2023 6:23 AM | Updated on Oct 9 2023 6:23 AM

GRT Jewellers wins Prestigious Award - Sakshi

హైదరాబాద్‌: జీఆర్‌టీ జ్యువెలర్స్‌ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ఎఫ్‌యూఆర్‌ఏ(ఫురా) రిటైల్‌ జ్యువెలర్‌ ఇండియా అవార్డ్స్‌ 2023 కార్యక్రమంలో ‘‘బ్రైడల్‌ స్టేట్‌మెంట్‌ జ్యువెలరీ ఆఫ్‌ ది ఇయర్‌’’ అవార్డు సొంతం చేసుకుంది. ఇటీవల వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్, సాలిటైర్‌ జెమోలాజికల్‌ లేబరేటరీస్‌ సహకారంతో 18 ఎడిషన్‌ అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి.

అద్భుతమైన డిజైన్లు మాత్రమే కాకుండా భావోద్వేగాలు ప్రతిఫలించేలా ఆభరణాలను రూపొందించడంలో నిబద్ధతను ఈ అవార్డు ప్రనరుద్ఘటిస్తోందని సంస్థ ఎండీ శ్రీ ఆనంద్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు. భారతీ సంస్కృతిలో వివాహాల వైభవం, ప్రాముఖ్యతను తెలియజేసే కళాఖండాలను తీర్చిదిద్దడంలో జీఆర్‌టీ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శిస్తుందని మరో ఎండీ జీఆర్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement