భారీగా పెరిగిన వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజు: కొత్త ధరలు ఇలా.. | Government Hikes Vehicle Fitness Test Fees, Check Out Updated Cost Details Inside | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజు: కొత్త ధరలు ఇలా..

Nov 18 2025 2:53 PM | Updated on Nov 18 2025 4:35 PM

Government Hikes Vehicle Fitness Test Fees Check Updated Cost

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) దేశవ్యాప్తంగా.. వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజును భారీగా పెంచుతూ, కొత్త సవరణలు చేసింది. కేంద్ర మోటారు వాహన నియమాల కింద.. కొత్త సవరణలు వెంటనే అమలులోకి వస్తాయి. వాహనాల వయసు, కేటగిరీ ఆధారంగా ఫీజును నిర్ణయించడం జరిగింది.

సవరణలలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. అధిక ఫీజులు మాత్రమే కాకుండా, వాహనాల వయసు పరిమితి తగ్గింపు. అంటే.. కొత్త సవరణలకు ముందు, 15 సంవత్సరాల కంటే పాత వాహనాలకు స్లాబ్‌లు వర్తిస్తాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాహనాలకు కూడా ఛార్జీలను విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

మూడు కేటగిరీలు
వాహనాల వయసు ఆధారంగా.. ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటిది 10-15 సంవత్సరాలు, రెండవది 15-20 సంవత్సరాలు, మూడవ వర్గం 20 సంవత్సరాల కంటే పాత వాహనాలు. కేటగిరిని బట్టి ఫీజులు క్రమంగా పెరుగుతాయి. వయస్సు ఆధారిత స్లాబ్‌లు అనేవి టూవీలర్స్, త్రీవీలర్స్, క్వాడ్రిసైకిళ్లు, లైట్ వెయిట్ వెహికల్స్, మిడ్ సైజ్, హెవీ వెహికల్స్ లేదా ప్యాసింజర్ వాహనాలతో సహా అన్ని వర్గాల వాహనాలకు వర్తిస్తాయి.

కొత్త ధరలు ఇలా..
కొత్త సవరణలు.. భారీ వాణిజ్య వాహనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ట్రక్కులు లేదా బస్సులు ఇప్పుడు ఫిట్‌నెస్ పరీక్ష కోసం రూ. 25,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. అదే వయస్సు గల మధ్యస్థ వాణిజ్య వాహనాల ఫీజు రూ. 1800 నుంచి రూ. 20వేలకు పెరిగింది.

20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న.. తేలికపాటి మోటారు వాహనాలకు ఫీజు రూ.15,000కు పెరిగింది, 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న త్రిచక్ర వాహనాలకు ఇప్పుడు రూ.7,000 వసూలు చేస్తారు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ద్విచక్ర వాహనాలకు రుసుము రూ.600 నుంచి రూ.2,000కు పెరిగింది.

15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాహనాలకు కూడా కొత్త ఫీజులు ఉన్నాయి. సవరించిన నియమం 81 ప్రకారం.. ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ కోసం మోటార్‌సైకిళ్లకు రూ.400, తేలికపాటి మోటారు వాహనాలకు రూ.600, మధ్యస్థ & భారీ వాణిజ్య వాహనాలకు రూ.1,000 వసూలు చేస్తారు.

ఇదీ చదవండి: నా దృష్టిలో అదే నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement