
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని.. 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
అక్టోబర్ 2026 తర్వాత.. తయారయ్యే అన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరిగా ఈవీఏఎస్ కలిగి ఉండాలని మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సిస్టం వల్ల ఎలక్ట్రిక్ కారు కూడా సౌండ్ చేస్తుంది. ఈ సౌండ్ వల్ల కారును ఎవరైనా సులభంగా గుర్తించవచ్చు.
అమెరికా, జపాన్, కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే హైబ్రిడ్ వాహనాలలో AVAS వాడకాన్ని తప్పనిసరి చేశాయి. ఇది రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇండియాలో కూడా ఈ విధానం అమలు చేయాలని సంకల్పించింది.
ఇదీ చదవండి: ఐదేళ్లలో 3 లక్షల సేల్స్: మళ్ళీ తగ్గిన ధర
నిజానికి ఎలక్ట్రిక్ కార్లు.. ఫ్యూయెల్ కార్ల మాదిరిగా సౌండ్ చేయవు. దీనివల్ల ముందు వెళ్తున్న కారుకు లేదా వ్యక్తులకు వెనుక ఒక కారు వస్తుందనే విషయం తెలియకుండా పోతుంది. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎలక్ట్రిక్ కార్లలో అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.