రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం | government approved 17 new projects worth Rs 7172 cr under ECMS | Sakshi
Sakshi News home page

రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

Nov 17 2025 9:23 PM | Updated on Nov 17 2025 9:23 PM

government approved 17 new projects worth Rs 7172 cr under ECMS

దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ECMS)’ కింద రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ.65,111 కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఈ ఆమోదాలతో ECMS కింద మొత్తం ఆమోదించబడిన ప్రాజెక్టుల సంఖ్య 24కి చేరింది.

ఇందులో జబిల్ సర్క్యూట్ ఇండియా, ఏక్యూస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యునో మిండా, ఏఎస్‌యూఎక్స్ సేఫ్టీ కాంపోనెంట్స్ ఇండియా, జెట్‌ఫాబ్‌ ఇండియా, టీఈ కనెక్టివిటీ ఇండియా, మీనా ఎలక్ట్రోటెక్..వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ 17 ప్రాజెక్టులు కెమెరా మాడ్యూల్, కనెక్టర్లు, మల్టీ లేయర్‌ పీసీబీ, ఆసిలేటర్లు.. వంటి ఆరు వేర్వేరు విభాగాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.

కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..భారతదేశంలోనే డిజైన్ సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్ని ఉత్పత్తుల్లో అత్యున్నతమైన ‘సిక్స్-సిగ్మా’ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఉత్పత్తుల మూల్యాంకన ప్రక్రియలో నాణ్యతా వ్యవస్థలు కీలకంగా ఉంటాయని మంత్రి నొక్కి చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం కొత్త నైపుణ్య ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధంగా ఉందని తెలిపారు.

గత నెలలో మంత్రి వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసీఎంఎస్ కింద ప్రభుత్వం రూ.59,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందాయి. ఈ పథకం కింద 91,600 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దరఖాస్తుదారులు దాదాపు 1.41 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రతిపాదించారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 8న రూ.22,919 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నోటిఫై చేసింది. అప్లికేషన్‌ విండో మే 1న ఓపెన్‌ చేసి సెప్టెంబర్ 30న మూసివేశారు.

ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్

ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ECMS) అనేది భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ భాగాలు, సబ్-అసెంబ్లీలు, కాపిటల్ గూడ్స్ తయారీని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే దీని లక్ష్యం. ECMS కింద పెట్టుబడిదారులు, తయారీదారులకు రెండు రకాల ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. టర్నోవర్-లింక్డ్ ప్రోత్సాహకాలు, కాపెక్స్-లింక్డ్ ప్రోత్సాహకాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement