బంగారం, వెండి బౌన్స్‌బ్యాక్‌ | Gold Silver Prices Bounce Back Gold Rises Silver Gains | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి బౌన్స్‌బ్యాక్‌

Sep 19 2026 7:19 AM | Updated on Sep 19 2026 7:23 AM

Gold Silver Prices Bounce Back Gold Rises Silver Gains

న్యూఢిల్లీ: ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనైన బంగారం, వెండి ధరలు వారాంతపు రోజున పుంజుకున్నాయి. దిగివస్తున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించడంతో, ఇన్వెస్టర్లు తిరిగి బులియన్‌ వైపు మొగ్గు చూపారు. ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రా. పసిడి ధర రూ.1,600 పెరిగి రూ.1,56,600కి చేరింది.

కిలో వెండి ధర రూ.5,000 ఎగసి రూ.2.47 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ  మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్స్‌కు 1.17% పెరిగి 4,392.78 డాలర్లకు చేరింది.  యుఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంచినప్పటికీ, క్రూడ్‌ ధరలు దిగిరావడంతో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయని బులియన్‌ నిపుణులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement