ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. డాలర్ విలువ తగ్గడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు ఉంటడం వల్ల గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేవాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో పసిడి ధరలు తారాస్థాయికి చేరాయి.
స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,295 డాలర్ల వరకు పెరిగి, తర్వాత స్వల్పంగా తగ్గి 4,268 డాలర్ల వద్ద స్థిరపడింది. గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 4,329 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. వరుసగా నాలుగో సెషన్‌లో బంగారం లాభాల్లో కొనసాగడం గమనార్హం.
అమెరికాలో జూలై నెలలో ప్రైవేట్ ఉద్యోగాల వృద్ధి మందగించిందని ఒక నివేదిక వెల్లడించింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తగ్గుతాయని మార్కెట్ అంచనా వేస్తోంది. ఇక మధ్యప్రాచ్యంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి జరుగుతున్న ప్రయత్నాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఇటీవల పెరుగుదల ఉన్నప్పటికీ బంగారం ఇంకా గత గరిష్ఠ స్థాయిల కంటే తక్కువగానే ఉంది. భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయి.
భారతదేశంలో బంగారం ధరలు
ఇండియన్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు గురువారం గణనీయంగా తగ్గింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2650 పెరిగి రూ.1,37,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.2890 పెరిగి రూ.1,49,730 వద్ద నిలిచింది. పెరిగిన ధరలను బట్టి చూస్తుంటే.. ఈ మధ్య కాలంలో ఇదే గరిష్టం అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: గూగుల్ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్!


