హాట్రిక్‌ తర్వాత బంగారం ధరలు మళ్లీ ఇలా.. | Gold and Silver Price Today On 26th June 2025, after Hat Trick Decline | Sakshi
Sakshi News home page

హాట్రిక్‌ తర్వాత బంగారం ధరలు మళ్లీ ఇలా..

Jun 26 2025 11:27 AM | Updated on Jun 26 2025 12:00 PM

Gold and Silver Price Today On 26th June 2025, after Hat Trick Decline

దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గి హాట్రిక్‌ కొట్టిన పసిడి ధరలకు నేడు (జూన్‌ 26) బ్రేక్‌ పడింది. దీంతో ఇంకాస్త తగ్గుతుందనుకున్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో  బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్‌ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070
హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.

ఢిల్లీలో.. 
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,100
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,850
ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.

చెన్నైలో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070
చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.

ముంబైలో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070
ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్‌లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.

బెంగళూరులో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070
బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.

👉 వెండి విషయంలో అమ్మో.. ఆయన మాటలు నిజమవుతాయా? 👈

వెండి ధరలు..
దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎటువంటి మార్పూ లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,18,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 1,08,000 వద్ద కొనసాగుతోంది.

(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement