13 లక్షల కస్టమర్లతో.. భారతదేశంలో మూడవ అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన జియోటస్, దేశంలో తమ మొదటి స్థానిక భాషా క్రిప్టో ఫ్యూచర్స్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. దీనిపేరు జియోటస్ అకాడమీ (Giottus Academy). క్రిప్టో గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం.
జియోటస్ అకాడమీలో కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాకుండా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైవ్ సెషన్స్ ఉంటాయి. స్థానిక భాషల్లో లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల.. క్రిప్టోకు సంబంధించిన ప్రతి విషయం సులభంగా అందరికీ అర్థమవుతుంది. దీనిని అగ్రశ్రేణి ట్రేడర్లు, విశ్లేషకులు కలిసి డిజైన్ చేశారు. కాబట్టి ఇందులో పాల్గొనేవారు ప్రతి దశను అర్థం చేసుకోవడానికి యాక్షన్ బేస్డ్ అభ్యాసంతో రియల్ టైమ్ ట్రేడింగ్ అనుభవాన్ని పొందవచ్చు.
జియోటస్ అకాడమీ ద్వారా.. రిజిస్ట్రేషన్స్, కేవైసీ, అడ్వాన్స్డ్ ట్రేడింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి విషయాలను నేర్చుకోవచ్చు. అంతే కాకుండా విశ్లేషణ, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గైడెన్స్, ఏఐ బేస్డ్ ట్రేడింగ్ సిగ్నల్స్, వ్యూహాత్మక సూచనలను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా, సురక్షితంగా, ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది.


