Foxconn Looking For New Partner As Vedanta JV Facing Issues - Sakshi
Sakshi News home page

వేదాంతాకు భారీ షాక్‌..1.54 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న ఫాక్స్‌కాన్‌!

Jun 26 2023 4:47 PM | Updated on Jun 26 2023 5:29 PM

Foxconn Looking For New Partner With Vedanta Jv Facing Issues - Sakshi

మైనింగ్ కంపెనీ వేదాంతా లిమిటెడ్‌కు భారీ షాక్‌ తిగిలింది.సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంతాతో కదుర్చుకున్న ఒప్పందం నుంచి తైవాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఫాక్స్‌కాన్ తప్పుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

రెండేళ్ల క్రితం ఫాక్స్‌కాన్‌ భారత్‌లో సెమీ కండక్టర్‌ తయారీ విభాగంలో అడుగు పెట్టాలని అనుకుంది. ఇందుకోసం వేదాంతాతో చేతులు కలిపింది. 67శాతం షేరుతో వేదాంత - ఫాక్స్‌కాన్‌ జాయింట్‌ వెంచ్‌ర్‌లో గుజరాత్‌ దోలేరా ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో రూ.1.54 లక్షల కోట్లతో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. 

తాజాగా, ఫాక్స్‌కాన్‌క, వేదాంతా సెమీ కండక్టర్‌ ప్రాజెక్ట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇరు సంస్థల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సెమీ కండక్టర్ల తయారీ కోసం వేదాంతాను వద్దనుకొని కొత్త భాగస్వామి కోసం ఫాక్స్‌కాన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు వేదాంత గ్రూప్ ఆర్థిక ఇబ్బందులతో ఫాక్స్‌కాన్‌ వేరే భాగస్వామిని చూసుకోవాలని సూచించిందని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. దీంతో, ఫాక్స్‌కాన్ మరో భాగస్వామికోసం ఇప్పటికే అనధికారిక చర్చలు జరిపినట్లు సమాచారం. వాటిల్లో రెండు కార్పొరేట్‌ దిగ్గజాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ రెండు కంపెనీలు ఏంటీ? ఫాక్స్‌కాన్‌కు, వేదాంతాల మధ్య ఎందుకు విబేధాలు తలెత్తాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. 

చదవండి👉 భారత్‌లో ఆఫీస్‌ను అమ్మేస్తున్న ఇంటెల్‌.. వేలాది మంది ఉద్యో‍గుల్ని..

Advertisement
 
Advertisement
Advertisement