
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమా.. దసరా, ధంతేరాస్, దీపావళి, భాయ్ దూజ్ సందర్భంగా ప్రత్యేక డీల్‌లతో పండుగ సీజన్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతున్నాయి.
వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్‌లు మొదలైనవి కొనుగోలు చేయడంతో డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ పొందవచ్చు. కొత్త జీఎస్టీ అమలులోకి రావడంతో.. టీవీలు, ఏసీలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆఫర్స్ ఎంచుకునే బ్రాండ్, స్టోర్, నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.