
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కి సమాధానమిచ్చేలా భారతదేశపు తొలి ఏఐ కాల్ అసిస్టెంట్‌ను రూపొందించినట్లు హైదరాబాదీ అంకుర సంస్థ ఈక్వల్ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక దిగ్గజం జీవీకే వారసుడు కేశవ రెడ్డి తెలిపారు.
ఈక్వల్ ఏఐ అక్టోబర్ 2 నుంచి ఢిల్లీ–ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అందుబాటులోకి వస్తుందని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని యన తెలిపారు. 2026 మధ్య నాటికి రోజుకు 10 లక్షల యాక్టివ్ యూజర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
గుర్తు తెలియని నంబర్లు, టెలీమార్కెటింగ్, డెలివరీ ఏజెంట్ల కాల్స్ మొదలైన వాటికి ఇది ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ భాషల్లో సమాధానమివ్వగలదు. అవసరమైతే యూజర్ మధ్యలో కాల్‌ను టేకోవర్ చేయొచ్చు.