
పీఎఫ్ నుంచి విత్డ్రా చేసిన సొమ్ము దుర్వినియోగానికి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులందరినీ అప్రమత్తం చేసింది. "తప్పుడు కారణాలతో" తమ ప్రావిడెంట్ ఫండ్ కార్పస్ నుండి సొమ్ము ఉపసంహరించుకోవద్దని హెచ్చరించింది. అలా విత్డ్రా చేసిన డబ్బును పెనాల్టీలు, వడ్డీలతో సహా తిరిగి వసూలు అధికారం ఈపీఎఫ్వోకు ఉందని స్పష్టం చేసింది.
పీఎఫ్ నిధుల ఉపసంహరణకు (PF money withdrawal) సంబంధించి ఈపీఎఫ్ఓ స్పష్టమైన నిబంధనలు నిర్దేశించింది. ఈపీఎఫ్ స్కీమ్ 1952 ప్రకారం.. సాధారణంగా, రిటైర్మెంట్ లేదా 58 సంవత్సరాల వయసు దాటిన తర్వాతే పీఎఫ్ బ్యాలెన్స్ ను ఉపసంహరించుకోవచ్చు. అంతకు ముందు ఇంటి కొనుగోలు, వివాహం, విద్య లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వంటి కొన్ని పరిస్థితుల్లో పాక్షిక ఉపసంహరణలకు వీలుంటుంది.
వేరే అవసరాలకు వాడితే..
అయితే ఈ ఉపసంహరణలు అన్నింటికీ సరైన పత్రాలు, రుజువులు అవసరం. ఈ నిబంధనలను ఉల్లంఘించినా లేదా పేర్కొన్న కారణం కోసం కాకుండా వేరే అవసరాలకు విత్డ్రా చేసిన పీఫ్ సొమ్మును వినియోగించినా వడ్డీ, జరిమానాలతో సహా ఆ సొమ్మును రికవరీ చేసే పూర్తి అధికారం ఈపీఎఫ్ఓకు ఉంటుంది. కాబట్టి పీఎఫ్ అడ్వాన్స్ కోసం అభ్యర్థన చేసేటప్పుడు ఉపసంహరణ నియమాలను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఈమేరకు ఈపీఎఫ్ఓ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో చందాదారులను అలర్ట్ చేసింది. ‘తప్పుడు కారణాలతో పీఎఫ్ ఉపసంహరించుకోవడం ఈపీఎఫ్ స్కీమ్ 1952 కింద రికవరీకి దారితీస్తుంది. మీ భవిష్యత్తును కాపాడుకోండి, సరైన అవసరాల కోసం మాత్రమే పీఎఫ్ను ఉపయోగించండి. మీ పీఎఫ్ మీ జీవితకాల భద్రతా కవచం!’ అని పేర్కొంది.
Withdrawing PF for wrong reasons can led to Recovery under EPF Scheme 1952.
Protect your future, use PF only for the right needs. Your PF is your lifelong safety shield!#EPFO #EPFOwithYou #HumHainNa #ईपीएफओ@PMOIndia @narendramodi @LabourMinistry @MIB_India @mansukhmandviya… pic.twitter.com/HMxUpWFair— EPFO (@epfoofficial) September 22, 2025
ఇదీ చదవండి: పసిడి మరింత పైకి.. వామ్మో వెండి ధర వింటే..