మస్క్‌ సెటైర్లు : ట్విటర్‌ ఉద్యోగి లంచ్‌ ఖరీదు రూ.32వేలా..తిన్నారా? చేశారా?

Elon Musk Said Twitter Spends 13 Million A Year On Food Service In Office - Sakshi

ఎలాన్‌ మస్క్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాల వ్యవధిలో ట్విటర్‌లో అనే నాటకీయ పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్‌ పెయిడ్‌ వెరిఫికేషన్‌ అంటూ ఇలా ప్రతి రోజు ఏదో ఒక వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే.  

తాజాగా ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ మాజీ వైస్ ప్రెసిడెంట్ ట్రేసీ హాకిన్స్‌తో ఉద్యోగులకు అందించే మధ్యాహ్న భోజనంపై విమర్శలు చేశారు. హాకిన్స్ ఒక వారం క్రితం వరకు ట్విటర్‌లో ఉద్యోగులకు మధ్యాహ్నం ఫుడ్ అందించారు. గత 12 నెలల్లో ఉద్యోగులు ఎవరూ ఆఫీస్‌కు రాలేదు. కానీ ప్రతి రోజు ఒక్కో భోజనానికి $400 (రూ. 32,471.30) కంటే ఎక్కువ ఖర్చు చేశారు’. ఇలా ట్విటర్‌ లంచ్‌ కింద ఏడాదికి 13 మిలియన్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు.   

మస్క్‌ విమర్శలపై హాకిన్స్‌ స్పందించారు. అబద్ధం..ఎలాన్‌ మస్క్‌తో పనిచేయడం ఇష్టం లేకనే ట్విటర్‌కు రాజీనామా చేశా. రాజీనామా ముందు వారం వరకు టిఫిన్‌ & భోజనం కోసం రోజుకు ఒక్కో ఉద్యోగికి $20-$25 డాలర్లు ఖర్చు చేశాను. ఆఫీస్‌కు వచ్చే ఉద్యోగల సంఖ్య 20-50% వరకు ఉందని చెప్పారు.  

కానీ సంస్థ రికార్డ్స్‌లో అలా లేదే అంటూ హాకిన్స్‌ ట్వీట్‌కు మస్క్‌ రిప్లయి ఇచ్చారు. లంచ్‌ అవర్‌లో పీక్‌ ఆక్యుపెన్సీ 25%, యావరేజ్‌ ఆక్యుపెన్సీ 10% కంటే తక్కువగా ఉంది. ఓహో..! ఇక్కడ తినే వాళ్ల కంటే..చేసేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారే అంటూ మస్క్ ఘాటుగా రిప్లయి ఇచ్చారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top