అమెరికా బడ్జెట్‌ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..! | Elon Musk backed Warren Buffett 5 minute plan to eliminate the US deficit | Sakshi
Sakshi News home page

అమెరికా బడ్జెట్‌ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!

Jun 12 2025 1:38 PM | Updated on Jun 12 2025 3:29 PM

Elon Musk backed Warren Buffett 5 minute plan to eliminate the US deficit

అమెరికా బడ్జెట్ లోటుతో సతమతమవుతోంది. ఏటా వసూళ్లు చేసే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. యూఎస్‌ జాతీయ రుణం జూన్ 2025 నాటికి 33.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్య దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. అందుకు ప్రముఖుల మద్దతు లభిస్తుంది. యూఎస్‌ ఆర్థిక లోపాలను సరిచేసేందుకు సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వారెన్‌ బఫెట్ పరిష్కారాన్ని ప్రతిపాదించారు.

‘నేను అమెరికా ఆర్థిక లోటును ఐదు నిమిషాల్లో ముగించగలను. జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులందరూ తిరిగి ఎన్నిక కావడానికి అనర్హులని చట్టం చేస్తే సరిపోతుంది’ అని వారెన్‌ బఫెట్‌ అన్నారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో వాషింగ్టన్‌లో తీవ్ర చర్చ మొదలైంది. ఉటా సెనేటర్ మైక్ లీ ఈ వీడియోను ఎక్స్‌లో తిరిగి పోస్ట్ చేశారు. ‘మీరు ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారా?’ అని టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ను అడిగారు. దాంతో మస్క్ 100 శాతం మద్దతు తెలుపుతానని, ఇదే మార్గమని చెప్పారు.

ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్‌

ఆర్థికవేత్త పీటర్ షిఫ్ స్పందిస్తూ..‘వారెన్‌ బఫెట్‌ ఆలోచనలు బ్రూటల్‌.. కానీ బ్రిలియంట్‌. ద్రవ్యోల్బణం 3% దాటినప్పుడల్లా కాంగ్రెస్‌లోని ప్రతి సభ్యుడిని తొలగించడానికి నేను రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఒక దేశం మొత్తం ద్రవ్యోల్బణం ముసుగులో బాధపడటం కంటే రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడం మంచిది’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement