
ప్రముఖ కంపెనీ, సరిపడే అనుభవం, నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు జీతాలు రూ.లక్షల్లో ఉంటాయని తెలిసిందే కదా. అయితే పెరుగుతున్న జీవనశైలి, ఖర్చులకుతోడు బెంగళూరు వంటి లివింగ్ కాస్ట్‌లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ జీతం ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో బెంగళూరులో నివసిస్తున్నవారికి సంవత్సరానికి రూ.50 లక్షలు (ఎల్‌పీఏ) సరిపోతుందా.. అని సామాజిక మాధ్యమాల వేదికగా టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొందరికి రూ.50 లక్షలు ఇస్తున్నా దాని విలువ సగానికి తగ్గి రూ.25 లక్షలకు సమానమైందా? అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధ్రువీకరించాలని కోరుతున్నారు. అవికాస్తా వైరల్‌గా మారుతున్నాయి.

ఇదీ చదవండి: ‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
సౌరవ్ దత్తా అనే టెకీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ..‘బెంగళూరు ఐటీ పరిశ్రమలో చాలా మంది రూ.50 ఎల్‌పీఏ సంపాదిస్తున్నారని విన్నాను. వారు పెరిగిన సీటీసీ లేదా రూ.50 ఎల్‌పీఏ రూ.25 ఎల్‌పీఏతో సమానమని చెబుతున్నారు. కొంతమంది టెక్కీలు ధ్రువీకరించగలరా?’ అని కోరారు. అందుకు ప్రతిస్పందనగా నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. రూ.50 ఎల్‌పీఏ కూడా నగరంలోని హై కాస్ట్ టెక్ వాతావరణంలో సరిపోదని కొందరు పేర్కొన్నారు. ‘రూ.50 ఎల్‌పీఏ ప్రస్తుతం రూ.10 ఎల్‌పీఏతోనే సమానం. చాలా మంది రూ.1 కోటి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించకపోతే సమయం వృథా అని మరొకరు కామెంట్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని సూచించారు.