ED Records 757 Bank Fraud Cases in Last 10 Years - Sakshi
Sakshi News home page

పదేళ్లలో 757 బ్యాంక్‌ మోసం కేసులు!

Aug 1 2023 4:14 AM | Updated on Aug 1 2023 9:28 PM

ED records 757 bank fraud cases in last 10 years - Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గత 10 సంవత్సరాలలో  ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులలో బ్యాంకు మోసాలకు సంబంధించిన 757 కేసులు నమోదుచేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ ఈడీ వద్ద నమోదయిన కేసులు 36 అని కూడా ఆయన వెల్లడించారు. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఈ కేసులు దాఖలయినట్లు పార్లమెంటుకు ఇచి్చన ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఈ ఏడాది జూలై 25వ తేదీ నాటికి  రూ. 15,805.91 కోట్ల ఆస్తులు జప్తు జరిగిందని,  రుణ బకాయిలకు సంబంధించి రూ. 15,113 కోట్లు బ్యాంకులకు సమకూర్చినట్లు పేర్కొన్నారు.  రుణ మోసాలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ మార్గాలను అనుసరించినట్లు  వెల్లడించారు. సివిల్‌ కోర్టులలో లేదా డెట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్‌ ఆస్తుల సెక్యూరిటీ– రీకన్‌స్ట్రక్షన్‌ కింద చర్యలు,  సెక్యూరిటీ ఇంటరెస్ట్‌ చట్టం అమలు,  నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా చర్యలు, చర్చల పరిష్కారం, రాజీ వంటి పలు మార్గాలు ఇందులో ఉన్నాయన్నారు. పది కేసుల్లో 14 మంది దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించామన్నారు. వీరిలో ఆరుగురిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా, ఏడుగురిని ప్రకటిత నేరస్థులుగా ప్రకటించామని మంత్రి తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement