Cases Register
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు
న్యూఢిల్లీ: ‘‘సుప్రీంకోర్టు చాలావరకు ప్రధాన న్యాయమూర్తిపైనే ఆధారపడి పని చేస్తోంది. అది సరికాదు. అత్యున్నత న్యాయస్థానం ‘సీజేఐ–కేంద్రిత’ ఇమేజీని తక్షణం వదిలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా అభిప్రాయపడ్డారు. ‘‘సుప్రీంకోర్టు ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దేశానికి ఎంతో సేవ చేసిందనడంలో సందేహం లేదు. కానీ ప్రజలు తనపై పెట్టుకున్న ఆకాంక్షలను మాత్రం నెరవేర్చలేకపోయిందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని చెప్పారు. ‘‘సుప్రీంకోర్టుకు ఇది ఉత్సవ సమయం కాదు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం’’ అని హితవు పలికారు. అంతేకాదు, సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల పనితీరే ప్రజాస్వామికంగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు! ‘‘హైకోర్టుల్లో తొలి ఐదు న్యాయమూర్తులతో కూడిన పాలక కమిటీ ఉంటుంది. అదే ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకుంటుంది. కమిటీలు, నిర్దారిత రోస్టర్ల ద్వారా హైకోర్టుల్లో కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. కానీ సుప్రీంకోర్టులో అలా కాదు. కార్యకలాపాలన్నీ ప్రధానంగా సీజేఐ ఆధారితంగా సాగుతాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘సుప్రీంకోర్టు అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించాలి. కేసుల లిస్టింగ్ పూర్తి పారదర్శకంగా జరగాలి. లిస్టింగ్, కోర్టు కార్యకలాపాల నిర్వహణలో టెక్నాలజీ వాడకం మరింతగా పెరగాలి’’ అంటూ కీలక సూచనలు చేశారు. ఇవన్నీ ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ హయాంలోనే కార్యరూపం దాలుస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. జస్టిస్ ఓకా శుక్రవారం రిటైరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ పలు కీలకాంశాలను లేవనెత్తారు. ‘‘హైకోర్టులతో పోలిస్తే సుప్రీంకోర్టు తన పనితీరు విషయంలో సీజేఐపై విపరీతంగా ఆధారపడుతుంది. అక్కడ న్యాయమూర్తిగా చేసిన ఈ మూడేళ్లలో దీన్ని బాగా గమనించాను. సుప్రీంకోర్టులో దేశ నలుమూలల నుంచి వచ్చే 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. అలాంటప్పుడు సీజేఐ ఆధారిత ఇమేజీ ఏమాత్రమూ సరికాదు. సుప్రీంకోర్టు మరింత సమ్మిళిత, నిర్మాణాత్మక వ్యవస్థగా మారాల్సిన అవసరముంది’’ అని స్పష్టం చేశారు. లిస్టింగ్ సమస్యలు సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ విషయంలోనూ తక్షణం పరిష్కరించాల్సిన అంశాలున్నాయని జస్టిస్ ఓకా చెప్పారు. ‘‘కొన్ని కేసులు మర్నాడే విచారణకు వస్తాయని, మరికొన్ని రోజుల తరబడి పెండింగ్‌లో ఉండిపోతాయని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. కేసుల లిస్టింగ్ విషయంలో హైకోర్టులు ఫిక్స్డ్ రోస్టర్‌ను పాటిస్తాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరించాలి’’ అని సూచించారు. ‘‘కేసుల లిస్టింగ్‌లో హేతుబద్ధత చాలా ముఖ్యం. వాటిని ఎవరూ వేలెత్తి చూపకుండా చూసుకోవాలి. మానవ ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇందుకు కృత్రిమ మేధ తదితర పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి. సుప్రీం కేవలం రాజ్యాంగ న్యాయస్థానం మాత్రమే కాదు. అపెల్లెట్ కోర్టు కూడా. కనుక రోజువారీ విధుల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత వంటివి చాలా ముఖ్యం’’ అని కుండబద్దలు కొట్టారు. న్యాయవ్యవస్థకు వెన్నెముక వంటి ట్రయల్, జిల్లా కోర్టులను హైకోర్టులు, సుప్రీంకోర్టు చిరకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయని జస్టిస్ ఓకా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టుల్లో 30 ఏళ్లుగా పెండింగ్ కేసులు భారీగా పేరుకుపోయాయని గుర్తు చేశారు.వీడ్కోలు ప్రసంగాలు అంత ఈజీ కాదువీడ్కోలు ప్రసంగాలు రాసుకోవడం అంత సులువు కాదంటూ చమత్కరించారు. ‘‘గత రెండు వారాలు భా రంగా గడిచా యి. ఎన్నో తీర్పు లు రాయాల్సొచ్చింది. వాటిని బుధవారానికల్లా పూర్తి చేసి గురువారం వీడ్కోలు ప్రసంగం సిద్ధం చేసుకుందామనుకున్నా. కానీ ఊపిరి సలపని కార్యభారం వల్ల కుదరనే లేదు’’ అని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తిగా రెండు దశాబ్దాల పై చిలుకు కెరీర్లో మెజారిటీ తీర్పుతో తాను ఎన్నడూ విభేదించలేదన్నారు. ఇప్పట్లో ఇంటర్వ్యూలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడేందుకు కాస్త సమయం కావాలన్నారు. నమ్మకమిచ్చిన తీర్పరి జస్టిస్ ఓకాపై సీజేఐ ప్రశంసలు జస్టిస్ ఓకాకు సీజేఐ గవాయ్ భావోద్వేగభరింతగా వీడ్కోలు పలికారు. ఆయన తన తీర్పు లతో అసంఖ్యాకులకు న్యాయవ్యవస్థపై నమ్మ కం కలిగించారని కొనియాడారు. ‘‘దాదాపు సమాంతరంగా సాగిన కెరీర్లు మా ఇద్దరివీ. న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఆయన అపార ప్రజ్ఞ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి వాదనకూ పూర్తిగా సంసిద్ధమై వచ్చేవారు. న్యాయమూర్తిగానూ అదే ఒరవడి కొనసాగించారు. రెండు రోజుల క్రితమే తల్లిని పోగొట్టుకున్నారు. అయినా అంత్యక్రియలు జరిగిన మర్నాడే విధులకు హాజరై 11 తీర్పులు వెలువరించారు. అంతటి అంకితభావమున్న అద్భుతమైన న్యాయమూర్తికి ఈ రోజు వీడ్కోలు పలుకుతున్నాం’’ అన్నారు. న్యాయమూర్తులతో పాటు యువ న్యాయవాదులకు జస్టిస్ ఓకా స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. -
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై నాలుగు కేసులు నమోదు
యర్రగొండపాలెం/టెక్కలి/మంత్రాలయం/ పామూరు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఎస్ఐ చౌడయ్య ఆయనకు మెమోలు అందజేశారు. మంత్రి లోకేశ్‌పై ట్వీట్ చేసిన కేసు ఒకటి కాగా, మరో మూడు కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారి పెట్టిన కేసులుగా ఎస్ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడపై ఫిర్యాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ సోమవారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసు సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీడీపీ కూటమి అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఎక్కడికక్కడ కేసులు పెడుతూనే ఉంది. సోమవారం రాత్రి మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు బగ్గు జయరామ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్టుకు రిమాండ్ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులపై పోస్టులు పెట్టిన వ్యక్తికి సోమవారం కనిగిరి జేఎఫ్‌సీఎం 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్ఐ కిషోర్‌బాబు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మల్కిపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు నానిబాబుపై పామూరుకు చెందిన మోషే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నానిబాబును ఆదివారం అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ చెప్పారు. -
ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. -
జూలైలోనే పక్కాగా రెక్కీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంట్‌లోకి పొగగొట్టాలను ఎలా దాచి తీసుకెళ్లాలన్న దానిపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌కు వచి్చన వారి షూలను తనిఖీ చేయట్లేరనే విషయాన్ని ‘రెక్కీ’ సందర్భంగా వీరు కనుగొన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన మనోరంజన్ జులైలోనే ఈ మేరకు ఒకసారి సందర్శకుల పాస్‌తో లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించాడని తెల్సింది. షూలు విప్పి తనిఖీలు చేయట్లేరనే విషయం గమనించి పొగ గొట్టాలను షూలో దాచి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్నోలో షూలను తయారుచేయించారట. మరోవైపు పార్లమెంట్లో ‘పొగ’ ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పాల్గొన్న మరో నలుగురిపాటు వారికి ఆశ్రయం కలి్పంచిన మరో వ్యక్తినీ అరెస్ట్‌చేశారు. లోక్‌సభ లోపల, వెలుపల పొగ గొట్టాలను విసిరిన నలుగురిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురికీ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు పంపించింది. ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కోల్‌కతాకు చెందిన ఇతడు విప్లవ యోధుడు భగత్ సింగ్ వీరాభిమాని. లలిత్, సాగర్, మనోరంజన్ ఏడాది క్రితం మైసూర్లో కలిశారు. అప్పుడే పార్లమెంట్ లోపలికి చొరబడేందుకు ప్రణాళిక రచించారు. వీరికి తర్వాత నీలమ్ దేవి, అమోల్ షిండే తోడయ్యారు. ఫేస్బుక్లో భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో సృష్టించిన పేజీలో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. లలిత్ వీరిని ముందుండి నడిపాడు. ప్రణాళిక ప్రకారమే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద మనోరంజన్ రెక్కీ నిర్వహించాడు. జూలైలో సందర్శకుల పాస్‌తో పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చాడు. భద్రతా సిబ్బంది సందర్శకుల షూలను విప్పి తనిఖీ చేయడం లేదని విషయం గమనించాడు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విశాల్ శర్మ అలియాస్ వికీ ఇంట్లో సాగర్, మనోరంజన్, అమోల్, నీలం, లలిత్‌లు బస చేశారు. ఉదయం అందరూ కలిసి పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వీరి సెల్ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకున్నాడు. పాస్‌లు ఇద్దరికి మాత్రమే రావడంతో మిగతా ముగ్గురు బయటే ఉండిపోయారు. అమోల్, నీలమ్‌లు పార్లమెంట్ ఆవరణలో పొగ గొట్టాలు విసురుతుండగా లలిత్ వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతాకు చెందిన ఒక ఎన్జీవో నిర్వాహకుడు నీలా„Š అయి‹Ùతో స్పెషల్ సెల్ పోలీసులు మాట్లాడారు. ఈ ఎన్జీవోతోనే లలిత్ ఝాకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం రాత్రి లలిత్ ఝాను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే పార్లమెంట్ ఘటన వెనుక నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వారం రోజుల రిమాండ్ పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పట్టుబడిన నలుగురిపై ఉపా చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గురువారం మనోరంజన్, సాగర్, అమోల్, నీలమ్‌లను ‘పటియాలా’ కోర్టుకు తీసుకొచ్చి ఎన్ఐఏ కేసులను విచారించే జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఏడు రోజుల రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒకే రకమైన సమాధానాలు సాగర్ శర్మ(26), మనోరంజన్(34), అమోల్ షిండే(25), నీలమ్ దేవి(37)లకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్యుల బృందంతో పోలీసులు మెడికల్ పరీక్షలు చేయించారు. అనంతరం వీరిని చాణక్యపురిలోని డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఫోర్స్(డీఎస్ఎఫ్) కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ముందుగా, నీలమ్, అమోల్‌లను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు, తర్వాత డీఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో వీరు రెండు సంస్థల పేరు వెల్లడించారు. నిందితులు చెబుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ‘దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్‌లో హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం, ఎంపీలు పై అంశాలపై చర్చ జరపాలనే ఉద్దేశంతో రంగుల పొగను వినియోగించాం. బ్రిటిష్ పాలనలో విప్లవయోధుడు భగత్ సింగ్ చేసినట్లుగా పార్లమెంట్లో అలజడి సృష్టించడం ద్వారా దేశ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారాలని భావించాం’ అని నలుగురు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు దొరక్కండా చేసేందుకే లలిత్ ఝా వీరి ఫోన్లను వెంటతీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బహుశా అతడు వీటిని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పదేళ్లలో 757 బ్యాంక్ మోసం కేసులు!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో బ్యాంకు మోసాలకు సంబంధించిన 757 కేసులు నమోదుచేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ ఈడీ వద్ద నమోదయిన కేసులు 36 అని కూడా ఆయన వెల్లడించారు. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ఈ కేసులు దాఖలయినట్లు పార్లమెంటుకు ఇచి్చన ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 25వ తేదీ నాటికి రూ. 15,805.91 కోట్ల ఆస్తులు జప్తు జరిగిందని, రుణ బకాయిలకు సంబంధించి రూ. 15,113 కోట్లు బ్యాంకులకు సమకూర్చినట్లు పేర్కొన్నారు. రుణ మోసాలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ మార్గాలను అనుసరించినట్లు వెల్లడించారు. సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్ ఆస్తుల సెక్యూరిటీ– రీకన్స్ట్రక్షన్ కింద చర్యలు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా చర్యలు, చర్చల పరిష్కారం, రాజీ వంటి పలు మార్గాలు ఇందులో ఉన్నాయన్నారు. పది కేసుల్లో 14 మంది దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించామన్నారు. వీరిలో ఆరుగురిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా, ఏడుగురిని ప్రకటిత నేరస్థులుగా ప్రకటించామని మంత్రి తెలిపారు. -
5 కోట్లకు పెండింగ్ కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మరో రెండు నెలల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల మార్కును దాటనుందని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇలాంటి కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ కింది కోర్టుల్లో మాత్రం పరిస్థితి సవాలుగానే మారిందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. కింది కోర్టులను మౌలిక వసతుల కొరత వేధిస్తోందని, అందుకే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పరిష్కారం కాని కేసులు కొన్ని నెలల క్రితం వరకు 4.83 కోట్లు ఉండేవన్నారు. ఇలాంటి కేసులపై ఎవరైనా తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు -
రౌడీషిటర్లకు కౌన్సెలింగ్
బంజారాహిల్స్: రౌడీషీటర్లు స్రత్పవర్తన కలిగి ఉండాలని నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషిటర్లకు గురువారం అడ్మిన్ ఎస్ఐ మహేశ్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవాలని అనవసరంగా రోడ్లపైన తిరగవద్దన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీషిటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాత్రిపూట పెట్రో, బ్లూకోట్స్ పోలీసులు రౌడీషీటర్లు నివసించే ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నామన్నారు. స్థానికులు కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. -
బెంగాల్ హింస: కేసులు నమోదు చేసిన సీబీఐ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, తగిన సమయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని, బాధితుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసేందుకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. -
కరోనా: వామ్మో రెండు లక్షల కేసులు
తమిళనాడు: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తూనే వినని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆ విధంగా కరోనా నిబంధనలు పాటించని వారిపై తమిళనాడు పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఇప్పటివరకు రెండు లక్షల 36 వేల 119 కేసులు బుక్ చేశారు. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం విస్మరించడం, శానిటైజర్ వాడకపోవడం వంటి అంశాల వారీగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మీ ఆరోగ్యం కోసమే నిబంధనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నా ప్రజలు బేఖాతర్ చేస్తుండడంతో కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నె పోలీస్ కమిషనర్ మహేశ్‌కుమార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు. కరోనాను దత్తత తీసుకున్నట్లు ఉంది.. ప్రజలు ఈ విషయం గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు. అంటే కరోనాను మనకై మనమే నిర్లక్ష్యం వహించి తెచ్చుకున్నామని వివరించారు. ఎన్నికలు ముగియడంతో కరోనా నిబంధనలు పాటించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం వంటివి చేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అయితే కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. మాస్క్ ధరించని కేసులే 85,764 ఉన్నాయని, 117 కేసులు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘన, ఇక భౌతిక దూరం పాటించని కేసులు ఏకంగా 1,50,318 ఉన్నాయని కమిషనర్ ప్రకటించారు. ఇలా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 2,36,199 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ మహేశ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న చెన్నె పోలీస్ కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ -
ప్రజాప్రతినిధులపై భారీగా క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై గత రెండేళ్లుగా క్రిమినల్ కేసులు భారీగా పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి సిట్టింగ్, మాజీ ప్రజా ప్రతినిధులపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం 4,859కు చేరుకున్నట్లు వివరించింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ రెండేళ్లుగా వేగవంతమైనప్పటికీ పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు విజయ్ హన్సారియా, స్నేహ కలిట సోమవారం సుప్రీంకోర్టు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ‘హైకోర్టులు సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ సెషన్స్, మెజిస్టీరియల్ స్థాయి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కొన్ని హైకోర్టులు కోరుతున్నాయి. ప్రతి కోర్టుకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా హైకోర్టులు లేఖలు కూడా రాశాయి. సాక్షులకు రక్షణ, భద్రత కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్ల కల్పనలో నిధుల కొరత సమస్యగా మారిందని హైకోర్టులు చెప్పాయి’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే పనిచేస్తున్న బెంగళూరు, అలహాబాద్ ప్రత్యేక కోర్టుల్లో విచారణ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, ఇలాంటి చోట్ల అదనంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
మమ్మల్ని కొట్టి మాపైనే కేసులా?: గండ్ర
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి మద్యం సేవించి తన సోదరుడికి చెందిన క్రషర్ వద్దకెళ్లి అక్కడున్న వాళ్లను కొట్టి తుపాకీతో బెదిరించిన వ్యక్తిని వదిలి తమపై ఆయుధ చట్టం కింద కేసులు పెట్టడమేంటని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులపై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో కనిపిస్తోం దన్నారు. తన సోదరుడిని బెదిరించినట్టు తెలిసి దీనిపై తాను ఏసీపీతో మాట్లాడానని, అయితే వారు తన సోదరుడి ఫిర్యాదుపై కేసు పెట్టకుం డా జాప్యం చేశారన్నారు. అనంతరం రవీందర్రావు అనే వ్యక్తి దగ్గర ఫిర్యాదు తీసుకుని తమపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. తుపాకులు పెట్టి బెదిరించడానికి తమ వద్ద తుపాకులే లేవ ని, తాను, తన సోదరుడు లైసెన్స్డ్ ఆయుధాలను ఎప్పుడో పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశామన్నారు. ఈ విషయంలో డీజీపీ చొరవ తీసుకొని, నిష్పాక్షిక విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎస్పీ స్టింగ్ ఆపరేషన్
తూప్రాన్:దాబా హోటళ్లలో మద్యం సిట్టింగ్, విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సుమతి హెచ్చరించారు. తూప్రాన్‌లోని దాబా హోటళ్లపై బుధవారం రాత్రి 10 సమయంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలోని బైపాస్ మార్గంలో సన్దాబాలో మద్యం సిట్టింగ్‌లను గమనించిన ఎస్సీ వెంటనే తన వాహనాన్ని పక్కన పెట్టించి సివిల్ డ్రెస్‌లో ఉన్న తన గన్మెన్లను దాబా హోటల్‌కు పంపించి మద్యం కొనుగోలు చేయమని ఆదేశించారు. దీంతో తన సిబ్బంది వెంటనే దాబాలోకి ప్రయాణికుల మాదిరిగా వెళ్లారు. తమకు మద్యం కావాలని కోరడంతో దాబా నిర్వహకుడు బ్లెండర్‌స్పైడ్ మద్యం బాటిల్‌ను విక్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్సీ సుమతి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ.సంతోష్‌కుమార్‌లు హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని దాబా నిర్వహకుణ్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్పీ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. నే రాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల గురించి డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దాబా హోటళ్లలో మద్యం విక్రయించినా, సిట్టింగ్‌లను నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బెల్ట్ షాపులు నిర్వహించి వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో తూప్రాన్‌లోని పలు దాబాలపై పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.