బెంగాల్‌ హింస: కేసులు నమోదు చేసిన సీబీఐ | West Bengal post poll violence CBI registers nine cases | Sakshi
Sakshi News home page

Bengal post poll violence: సీబీఐ కేసులు

Aug 26 2021 2:47 PM | Updated on Aug 26 2021 2:50 PM

West Bengal post poll violence CBI registers nine cases - Sakshi

కోల్‌కతా: ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన హింస‌కు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, తగిన సమయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని  సీబీఐ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని, బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసేందుకు  రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు సీబీఐ అధికారి  ఒకరు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement