ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్‌ కేసులు | ADR Report: 33 percent Rajya Sabha members have declared criminal cases | Sakshi
Sakshi News home page

ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్‌ కేసులు

Mar 2 2024 5:55 AM | Updated on Mar 2 2024 5:55 AM

ADR Report: 33 percent Rajya Sabha members have declared criminal cases - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్‌ ఎంపీలపై నమోదైన క్రిమినల్‌ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌(ఏడీఆర్‌) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు గుర్తించింది.

ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement