rajya sabha mps
-
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. తరుణ్‌చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నామినేషన్ తిరస్కరణతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలను బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. బీజేపీ తరఫున తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడటంతో ఎన్నికలు అవసరం లేకుండా పోయాయి. జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉండటంతో రిటర్నింగ్ ఆఫీసర్ వారిని ఏకగ్రీవంగా ప్రకటించి సర్టిఫికెట్లు అందజేశారు.కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను బీజేపీ అభ్యంతరాల ఆధారంగా రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఒక కేసును అఫిడవిట్లో వెల్లడించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే నటరాజన్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టి పారేశారు. ఆమె ఇప్పటికే హైదరాబాద్ కోర్టులో ఆ కేసుపై పిటిషన్ వేసి, దాన్ని వ్యతిరేకిస్తున్నారు.కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తిరస్కరణను.. తప్పు, పక్షపాతపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. చట్ట విరుద్ధం’అని సుప్రీం కోర్టులో వాదించారు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు రిటర్నింగ్ ఆఫీసర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైన నిర్ణయం, చట్టబద్ధమైనదే అని కోర్టులో వాదించారు. అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పిటిషన్‌ను అంగీకరించకూడదని కోర్టులో ప్రతిపాదించారు. పిటిషన్లో ఎన్నికల ఫలితాలపై స్టే కోరినా.. జూన్ 12న కోర్టులో విచారణ జరగనుందని, అప్పటివరకు స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపే సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ, అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చరిత్రాత్మక విజయంతో ఉత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఏమాత్రం సమయం వృథా చేయకుండా తన తదుపరి లక్ష్యాన్ని ఖరారు చేసేసింది. బెంగాల్లో గెలుపు సంబరాలు ముగియక ముందే, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలిత రాష్ట్రమైన పంజాబ్ పై గురిపెట్టింది. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావాన్ని పూరించింది.సంచలనంగా మారిన ‘నెక్స్ట్ పంజాబ్’పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అఖండ విజయం సాధించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తన తదుపరి కార్యాచరణను ప్రపంచానికి ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ వేదికగా బీజేపీ పంజాబ్ శాఖ ‘నెక్స్ట్ పంజాబ్’ (తదుపరి పంజాబ్) అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు కమల పుష్పం ఎమోజీని కూడా జతచేసింది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఈ పోస్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది.గత వ్యూహమే మళ్లీ అమలు..ఈ తరహా సంచలన ప్రకటన బీజేపీకి కొత్తేమీ కాదు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించిన తర్వాత, నవంబర్ 14, 2025న బీజేపీ బెంగాల్ శాఖ కూడా అచ్చం ఇలాగే ట్వీట్ చేసింది. ఆనాడు ‘నెక్స్ట్ వెస్ట్ బెంగాల్’ అంటూ కమలం గుర్తుతో పోస్ట్ చేసి, అనంతరం బెంగాల్ ను కైవసం చేసుకుంది. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ, వ్యూహాత్మకంగా ఇప్పుడు పంజాబ్ వైపు అడుగులు వేస్తోంది.యూపీ, పంజాబ్లపై బీజేపీ పూర్తి ఫోకస్ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ, అదే జోరును భవిష్యత్తులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన అద్భుత విజయంతో ఉత్సాహంలో ఉన్న కమలనాథులు, వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే తమ పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ఈ రాష్ట్రాల్లో గెలుపే ధ్యేయంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.అధికార ఆప్‌కు కోలుకోలేని భారీ దెబ్బపంజాబ్లో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఏడాది ఏప్రిల్ లో ఊహించని భారీ షాక్ తగిలింది. ఆప్‌కు చెందిన ఏడుగురు కీలక రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఏడుగురిలో రాఘవ్ చద్దా సహా ఆరుగురు ఎంపీలు పంజాబ్ నుంచే ఎన్నికైన వారు కావడం గమనార్హం. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా, ఆప్‌కు కోలుకోలేని రాజకీయ దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.పంజాబ్‌లో రసవత్తర పోరు ఖాయంఆప్ రాజ్యసభ సభ్యుల వలసతో పంజాబ్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో బలోపేతం కావాలని, ఆప్ చేతిలో నుంచి అధికారాన్ని లాక్కోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎంపీల చేరికతో పంజాబ్‌లో బీజేపీకి అమాంతం బలం పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నికల సమరం ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.అప్రకటితంగా మొదలైన ఎన్నికల ప్రచారంసోషల్ మీడియాలో వచ్చిన తాజా పోస్ట్ చూస్తుంటే, పంజాబ్‌లో బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే సాధించిన రాజకీయ ఆకర్షణలను క్షేత్రస్థాయిలో ఓట్లుగా మలచుకునే వ్యూహాలకు ఆ పార్టీ పదును పెడుతోంది. పశ్చిమ బెంగాల్ భారీ విజయం ఇచ్చిన అమితమైన ఆత్మవిశ్వాసంతో, పంజాబ్‌లో జరగబోయే ఈ అత్యంత కీలకమైన పోరు కోసం కాషాయ దళం సర్వసన్నద్ధంగా బరిలోకి దిగుతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ కోటను కూల్చివేసిన బీజేపీ.. ఇప్పుడు అతని పంజాబ్ కోటను పెకిలించివేయడానికి సిద్ధం అవుతోంది. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా? -
ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. -
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి బుధవారం కలిశారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రాలు తీసుకున్న అనంతరం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ఏప్రిల్ 2వ తేదీతో ఖాళీ కానున్న మూడు స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో పూర్తయ్యింది. నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో 11 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే వైఎస్సార్సీపీకి 8 మంది సభ్యులున్నారు. ఇప్పుడు మిగతా మూడు స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరాయి. దాంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమయ్యాయి. టీడీపీ బలం సున్నాకు చేరింది. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు.. 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!
న్యూఢిల్లీ: రాజ్యసభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షం కంటే వెనుకబడిన అధికార బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను మచ్చిక చేసుకుంటోంది. దీని ఫలితంగానే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు నీరజ్ శేఖర్ అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇంకొందరు కూడా ‘కాషాయ’బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 78కి చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వచ్చే ఏడాది కల్లా రాజ్యసభలో అధికార ఎన్డీఏకి మెజారిటీ దక్కే అవకాశముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోగానే బీజేపీకి రాజ్యసభలో పైచేయి సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఎన్డీఏలోని జేడీయూ వంటి పార్టీలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే బలం పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కైవసం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. -
విలువల ప్రయాణం
-
సచిన్,రేఖ తీరుపై విమర్శల వెల్లువ
-
కొత్త ఎంపీల్లో కోటీశ్వరులు వీరే!
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 96 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇటీవల 57 మంది రాజ్యసభకు ఎన్నికైయ్యారు. వీరిలో ఎన్పీపీకి చెందిన ప్రపుల్ పటేల్ అత్యధిక ఆస్తులు కలిగిన వారిగా గుర్తించినట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సర్వే నివేదిక వెల్లడించింది. ఆయనకు రూ. 252 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ (212 కోట్లు), సతీశ్ చంద్ర మిశ్రా(193 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన రాజ్యసభ ఎంపీల్లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర టాప్-10 జాబితాలో లేకపోవడం గమనార్హం. ఆయన ఆస్తిపాస్తులు రూ. 49 కోట్లుగా చూపించారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎంపీల జాబితాలో బీజేపీకి అనిల్ దవే(60 లక్షలు), రామకుమార్(86 లక్షలు), కాంగ్రెస్ కు చెందిన(1.8కోట్లు) ఉన్నారు. 57 మంది ఎంపీల్లో 13 మంది(23 శాతం)పై క్రిమినల్ కేసులు, ఏడుగురు(12 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. -
ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు
-
ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు
న్యూఢిల్లీ : నకిలీ టిక్కెట్లు దాఖలు చేసి ప్రభుత్వం నుంచి భారీగా ప్రయాణ ఖర్చులు(ఎల్టీసీ)రాబట్టిన కేసులో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు మాజీ ఎంపీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీతో పాటు ఒడిశాలోని ఎంపీల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణనికి సంబంధించి ఎంపీలపై చీటింగ్, ఫోర్జరీ కేసులు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైనవారిలో లాల్‌మింగ్ లియానా(ఎంఎన్ఎఫ్), బందోపాధ్యాయ(టీఎంసీ), బీఎస్పీకి చెందిన బ్రజేష్ పాఠక్ ...మరో ముగ్గురు మాజీ ఎంపీలు జేపీఎన్ సింగ్(బీజేపీ), మహమూద్ ఎ.మదాని(ఆర్ఎల్డీ), బీజేడీకి చెందిన రేణుబల ప్రధాన్ ఉన్నారు. అలాగే పలు ట్రావెల్ ఏజెన్సీలపై కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కాగా గత మార్చి నెలలో ఓ వ్యక్తి 600 ఖాళీ బోర్డింగ్ పాసులతో కోల్‌కతాలో దొరికిపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.


