సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీలు

Ysrcp Rajya Sabha Mps Meets Cm Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి బుధవారం కలిశారు. రిటర్నింగ్‌ అధికారి నుంచి ధృవపత్రాలు తీసుకున్న అనంతరం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రాజ్యసభలో ఏప్రిల్‌ 2వ తేదీతో ఖాళీ కానున్న మూడు స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో పూర్తయ్యింది. నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాజ్యసభలో రాష్ట్ర కోటాలో 11 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి 8 మంది సభ్యులున్నారు. ఇప్పుడు మిగతా మూడు స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరాయి. దాంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన 11 స్థానాలూ వైఎస్సార్‌సీపీ పరమయ్యాయి. టీడీపీ బలం సున్నాకు చేరింది. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు.. 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ గల్లంతవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.    

ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్‌.. కుప్పం బరిలో భువనేశ్వరి?

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top