మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌ | All three BJP Rajya Sabha candidates won unopposed and received certificates of victory | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌

Jun 11 2026 3:56 PM | Updated on Jun 11 2026 4:33 PM

All three BJP Rajya Sabha candidates won unopposed and received certificates of victory

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.  తరుణ్‌చుగ్‌, రజనీష్‌ అగర్వాల్‌, మహేష్‌ పేర్లను ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నామినేషన్‌ తిరస్కరణతో కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్‌ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలను బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. బీజేపీ తరఫున తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్‌ పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడటంతో ఎన్నికలు అవసరం లేకుండా పోయాయి. జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉండటంతో రిటర్నింగ్ ఆఫీసర్ వారిని ఏకగ్రీవంగా ప్రకటించి సర్టిఫికెట్లు అందజేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను బీజేపీ అభ్యంతరాల ఆధారంగా రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఒక కేసును అఫిడవిట్‌లో వెల్లడించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే నటరాజన్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టి పారేశారు. ఆమె ఇప్పటికే హైదరాబాద్ కోర్టులో ఆ కేసుపై పిటిషన్ వేసి, దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తిరస్కరణను.. తప్పు, పక్షపాతపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. చట్ట విరుద్ధం’అని సుప్రీం కోర్టులో వాదించారు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు రిటర్నింగ్ ఆఫీసర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. 

ఆయన అభిప్రాయం ప్రకారం, నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైన నిర్ణయం, చట్టబద్ధమైనదే అని కోర్టులో వాదించారు. అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పిటిషన్‌ను అంగీకరించకూడదని కోర్టులో ప్రతిపాదించారు. పిటిషన్‌లో ఎన్నికల ఫలితాలపై స్టే కోరినా.. జూన్ 12న కోర్టులో విచారణ జరగనుందని, అప్పటివరకు స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్‌ పిటిషన్‌పై రేపే సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ, అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Advertisement
 
Advertisement
Advertisement