మమ్మల్ని కొట్టి మాపైనే కేసులా?: గండ్ర

Case filed against Gandra Venkata Ramana Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అర్ధరాత్రి మద్యం సేవించి తన సోదరుడికి చెందిన క్రషర్‌ వద్దకెళ్లి అక్కడున్న వాళ్లను కొట్టి తుపాకీతో బెదిరించిన వ్యక్తిని వదిలి తమపై ఆయుధ చట్టం కింద కేసులు పెట్టడమేంటని మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులపై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో కనిపిస్తోం దన్నారు.

తన సోదరుడిని బెదిరించినట్టు తెలిసి దీనిపై తాను ఏసీపీతో మాట్లాడానని, అయితే వారు తన సోదరుడి ఫిర్యాదుపై కేసు పెట్టకుం డా జాప్యం చేశారన్నారు. అనంతరం రవీందర్‌రావు అనే వ్యక్తి దగ్గర ఫిర్యాదు తీసుకుని తమపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. తుపాకులు పెట్టి బెదిరించడానికి తమ వద్ద తుపాకులే లేవ ని, తాను, తన సోదరుడు లైసెన్స్‌డ్‌ ఆయుధాలను ఎప్పుడో పోలీస్‌ స్టేషన్‌లో డిపాజిట్‌ చేశామన్నారు. ఈ విషయంలో డీజీపీ చొరవ తీసుకొని, నిష్పాక్షిక విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top