క్రెడిట్‌ కార్డులపై దీపావళి ఆఫర్లు | Diwali Festive Offers On American Express HDFC HSBC Axis Credit Cards | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డులపై దీపావళి ఆఫర్లు

Oct 27 2024 1:29 PM | Updated on Oct 27 2024 3:23 PM

Diwali Festive Offers On American Express HDFC HSBC Axis Credit Cards

దేశీయ కన్స్యూమర్‌ క్రెడిట్ మార్కెట్‌ప్లేస్ పైసాబజార్ పలు క్రెడిట్ కార్డ్‌లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను వెల్లడించింది. పైసాబజార్ ద్వారా కొత్త క్రెడిట్ కార్డ్‌లను తీసుకునేవారికి గిఫ్ట్ కార్డ్‌లను అందిస్తోంది.

నిర్దిష్ట అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్‌బీసీ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్‌లు రూ.1,500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ని అందుకుంటారు. హచ్‌ఎస్‌బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మెంబర్‌షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్, హెచ్‌ఎస్‌బీసీ లైవ్+ క్రెడిట్ కార్డ్ వంటివి వాటిలో ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ రెగాలియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డ్, మర్రియోట్ బన్వాయ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్, అట్లాస్‌ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వంటివాటిపై పైసాబజార్ అదనంగా రూ. 1,000 అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను అందిస్తోంది.

అమెజాన్‌లో వివిధ రకాల కొనుగోళ్ల కోసం ఉపయోగించగల ఈ వోచర్‌లను క్రెడిట్ కార్డ్‌లు యాక్టివేట్ అయినప్పుడు అందుకోవచ్చు.పైసాబజార్ ప్రకారం.. ఈ ఆఫర్‌లు పండుగ సీజన్‌లో కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. పైసాబజార్ ప్రస్తుతం పదికిపైగా బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా 60కిపైగా క్రెడిట్‌ కార్డులను అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement