
భారతదేశంలో పండుగ సీజన్ మొదలవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు.. తమ ఉత్పత్తులపై డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ అందించడానికి సిద్ధమయ్యారు. ఈ కథనంలో ఆగస్టు నెలలో ఎలక్ట్రిక్ కార్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం.
కియా ఈవీ6
కియా ఈవీ6 కొనుగోలుపైన ఈ నెలలో కంపెనీ సుమారు రూ.10 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం GT-లైన్ AWD వేరియంట్‌లో మాత్రమే ఈ కారు అమ్మకానికి ఉంది.

మహీంద్రా XUV400
దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెలలో తన XUV400 ఈవీ కొనుగోలుపై రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్ అనేది మీరు ఎందుకుని వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారు 375 కిమీ నుంచి 456 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ & కామెట్
ఎంజీ మోటార్ తన జెడ్ఎస్ ఈవీ కొనుగోలుపైన రూ. 2.5 లక్షలు, కామెట్ ఈవీపైన రూ. 60,000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే విండ్సర్ మీద ఎటువంటి తగ్గింపులు లేదు.

సిట్రోయెన్ ఈసీ3
సిట్రోయెన్ తన ఈసీ3 కొనుగోలుపైన రూ. 1.25 లక్షల డిస్కౌంట్ అందిస్తుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. చూడటానికి SUV మాదిరిగా కనిపించే ఈ హ్యాచ్‌బ్యాక్ 2540 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్
క్రెటా ఎలక్ట్రిక్ కారుపైన హ్యుందాయ్ కంపెనీ రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ ఎంపిక చేసుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. 390 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు.. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?
టాటా ఎలక్ట్రిక్ కార్లు
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల మీద రూ. 45000 నుంచి రూ. లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ టియాగో, పంచ్ , నెక్సాన్ , కర్వ్, హారియర్ ఈవీ వంటివాటి మీద ఈ డిస్కౌంట్ అందిస్తోంది. హారియర్ ఈవీ కొనుగోలుపై లాయల్టీ ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. టియాగో ఈవీ కొనుగోలుపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.
NOTE: డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ అనేవి నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. డిస్కౌంట్స్ గురించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి, మీ సమీపంలోని బ్రాండ్ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.