
దేశంలో ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. కార్లు, బైకులు సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. 2025 జులై నెలలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్ 10 కార్లు ఏవో ఈ కథనంలో చూసేద్దాం..
మారుతి సుజుకి డిజైర్ జూలై 2025లో అత్యధికంగా (20,895 యూనిట్లు) అమ్ముడైన కారుగా నిలిచింది. జూన్ 2025లో ఈ కారు సేల్స్ 15,484 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. డిజైర్ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగి
డిజైర్ తరువాత ఎక్కువగా అమ్ముడైన కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా (16,898 యూనిట్లు), మారుతి ఎర్టిగా (16,604 యూనిట్లు), మారుతి వ్యాగన్ ఆర్ (14,710 యూనిట్లు), మారుతి స్విఫ్ట్ (14,200 యూనిట్లు), మారుతి బ్రెజ్జా (14,100 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (13,800 యూనిట్లు), మారుతి ఫ్రాంక్స్ (12,900 యూనిట్లు), టాటా నెక్సాన్ (12,855 యూనిట్లు), మారుతి బాలెనొ (12,600 యూనిట్లు) ఉన్నాయి.
