top 10 cars
-
టాప్ 10 రియర్ వీల్ డ్రైవ్ కార్లు ఇవే..
భారతదేశంలో ఆల్ వీల్స్ డ్రైవ్ (AWD), రియర్ వీల్ డ్రైవ్ (RWD) వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఇందులో రియర్ వీల్ డ్రైవ్ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎక్కువమంది ఈ మోడల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో అత్యంత సరసమైన 10 రియర్ వీల్ డ్రైవ్ కార్లు ఏవి?, వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.➤టయోటా ఫార్చ్యూనర్: రూ.35.37 లక్షలు➤మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: రూ.21.90 లక్షలు➤ఇసుజు డీ-మ్యాక్స్: రూ.21.50 లక్షలు➤టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ.19.99 లక్షలు➤మహీంద్రా బిఈ6: రూ.18.90 లక్షలు➤మహీంద్రా స్కార్పియో: రూ.13.62 లక్షలు➤మహీంద్రా థార్: రూ.11.50 లక్షలు➤మహీంద్రా బొలెరో: రూ.9.79 లక్షలు➤ఎంజీ కామెట్: రూ. రూ. 7 లక్షలు➤మారుతి ఈకో: రూ.5.44 లక్షలురియర్ వీల్ డ్రైవ్రియర్ వీల్ డ్రైవ్ కార్లలోని ఇంజిన్.. శక్తిని (పవర్) వెనుక చక్రాలను డెలివరీ చేస్తుంది. అప్పుడు వెనుక చక్రాలను కారును ముందుకు నెడతాయి. అయితే ఈల్ వీల్ డ్రైవ్ కార్లు.. శక్తిని అన్ని చక్రాలను పంపుతాయి. ధరల పరంగా ఆల్ వీల్ డ్రైవ్ కార్ల కంటే.. రియర్ వీల్ డ్రైవ్ కార్ల ధరలే తక్కువ. ఈ కారణంగానే చాలామంది ఈ RWD కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. -
భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు
భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్న అన్ని కార్లూ.. గొప్ప విక్రయాలను పొందలేవు. కానీ కొన్ని కార్లు మాత్రం ఊహకందని రీతిలో అమ్ముడవుతాయి. ఈ కథనంలో ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లను గురించి తెలుసుకుందాం.దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో 2021లో 'పంచ్' పేరుతో మైక్రో ఎస్యూవీని లాంచ్ చేసింది. ఈ కారు ఈ ఒక్క ఏడాది ఏకంగా 1.86 లక్షల సేల్స్ పొంది.. అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. 2023లో 1.50 లక్షల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ సేఫ్టీ రేటింగులో 5 స్టార్స్ సొంతం చేసుకుని, అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో పంచ్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.2024లో (జనవరి నుంచి నవంబర్) అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు⮞టాటా పంచ్: 1,86,958 యూనిట్లు⮞హ్యుందాయ్ క్రెటా: 1,74,311 యూనిట్లు⮞మారుతి సుజుకి బ్రెజ్జా: 1,70,824 యూనిట్లు⮞మహీంద్రా స్కార్పియో: 1,54,169 యూనిట్లు⮞టాటా నెక్సాన్: 1,48,075 యూనిట్లు⮞మారుతి సుజుకి ఫ్రాంక్స్: 1,45,484 యూనిట్లు⮞మారుతి సుజుకి గ్రాండ్ విటారా: 1,15,654 యూనిట్లు⮞హ్యుందాయ్ వెన్యూ: 1,07,554 యూనిట్లు⮞కియా సోనెట్: 1,03,353 యూనిట్లు⮞మహీంద్రా బొలెరో: 91,063 యూనిట్లుఇదీ చదవండి: మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా? -
ప్రమాదంలో ప్రాణాలు కాపాడే సేఫెస్ట్ కార్లు (ఫోటోలు)
-
టాప్ 10లో ఏడు కార్లు మారుతివే!
జూలై నెలలో కార్ల అమ్మకాలు మంచి జోరుమీద సాగాయి. ప్రధానంగా వర్షాలు బాగా కురవడంతో ఈ అమ్మకాలు పెరిగాయని అంటున్నారు. మొత్తం అమ్మకాల్లో మారుతి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. బాగా అమ్ముడైన టాప్ 10 కార్ల బ్రాండ్లలో ఏడు మారుతివే కావడం గమనార్హం. దాని ప్రధాన పోటీదారు హ్యుందయ్ కార్స్ కూడా గత నెల అమ్మకాల్లో 12.9 శాతం వృద్ధి సాధించింది. మారుతి, హ్యుందయ్లతో పాటు క్విడ్ అమ్మకాల పుణ్యమాని ఫ్రెంచి కార్ల కంపెనీ రెనో కూడా టాప్ 10 జాబితాలో చోటు సంపాదించింది. మారుతి ఆల్టో, డిజైర్, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ బ్రాండ్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. మారుతి కార్లలో మంచి ఆదరణ పొందిన ఆల్టో బ్రాండ్ ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఐదో స్థానంలో హ్యుందయ్ గ్రాండ్ ఐ10 ఉండగా, ఆరో స్థానంలో రెనో క్విండ్ నిలిచింది. మారుతి బాలెనో, హ్యుందయ్ ఇలైట్ ఐ20 బ్రాండ్లు మాత్రం ఏడు, ఎనిమిది స్థానాలకు పరిమితం అయ్యాయి. మారుతి సెలెరియో, సియాజ్ బ్రాండ్లు 9, 10 స్థానాల్లో ఉన్నాయి. టాటా టియాగో అమ్మకాలు కూడా బాగానే ఉన్నా.. అది 11వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూలైలో వివిధ బ్రాండ్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. ఆల్టో - 19,844 డిజైర్ - 19,229 వ్యాగన్ ఆర్- 15,207 స్విఫ్ట్ - 13,934 గ్రాండ్ ఐ10- 11,961 క్విడ్ - 9,897 బాలెనో- 9,120 ఇలైట్ ఐ20 - 8,205 సెలెరియో- 7,792 సియాజ్ - 5,162