
ఆగస్టు 2025లో మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తరువాత జాబితాలో డిజైర్, క్రెటా, వ్యాగన్ ఆర్, నెక్సాన్ మొదలైనవి నిలిచాయి. ఈ కథనంలో.. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏవో చూసేద్దాం.
➤మారుతి ఎర్టిగా: 18,445
➤మారుతి డిజైర్: 16,509
➤హ్యుందాయ్ క్రెటా: 15,924
➤మారుతి వ్యాగన్ఆర్: 14,552
➤టాటా నెక్సాన్: 14,004
➤మారుతి బ్రెజ్జా: 13,620
➤మారుతి బాలెనో: 12,549
➤మారుతి ఫ్రాంక్స్: 12,422
➤మారుతి స్విఫ్ట్: 12,385
➤మారుతి ఈకో: 10,785
పై జాబితాను గమనిస్తే.. టాప్ 10 కార్లలో 8 కార్లు మారుతి సుజుకి కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. మిగిలిన రెండు హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా, టాటా మోటార్స్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్‌కు రీకాల్: 1500 కార్లు వెనక్కి!
ఈ నెలలో (సెప్టెంబర్) కూడా.. దేశంలో వాహన అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం వాహనాల ధరల తగ్గుదల, ఫెస్టివల్ సీజన్. విజయదశమి, దీపావళి సందర్భంగా చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో వాహనాల సేల్స్ పెరుగుతాయి.