హైదరాబాదీ సంస్థకు డీబీఎస్‌ ఫౌండేషన్‌ అవార్డు | DBS Foundation Award 2025 won by Hyderabad based company | Sakshi
Sakshi News home page

హైదరాబాదీ సంస్థకు డీబీఎస్‌ ఫౌండేషన్‌ అవార్డు

Jun 19 2025 8:22 AM | Updated on Jun 19 2025 10:06 AM

DBS Foundation Award 2025 won by Hyderabad based company

వృద్ధులకు సంరక్షణ సేవలు అందించే హైదరాబాదీ సంస్థ లైఫ్‌ సర్కిల్‌ హెల్త్‌ సర్వీసెస్‌కు (ఇండియా) డీబీఎస్‌ ఫౌండేషన్‌ ఇంపాక్ట్‌ బియాండ్‌ అవార్డు దక్కింది. దీనితో సంస్థకు సుమారు రూ. 3 కోట్ల గ్రాంట్‌ ఫండింగ్‌ లభించింది. ఈ తరహా సేవలకు గణనీయంగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ సీఈవో అనంత్‌ కుమార్‌ తెలిపారు. లైఫ్‌ సర్కిల్‌ వృద్ధులకు ప్రొఫెషనల్‌గా సర్వీసులను అందించడమే కాకుండా సంరక్షకులకు శిక్షణతో పాటు జీవనోపాధి కూడా కల్పిస్తోందని డీబీఎస్‌ ఫౌండేషన్‌ హెడ్‌ కరెన్‌ నిగుయి చెప్పారు. వంద దరఖాస్తులు రాగా సింగపూర్, చైనా, హాంకాంగ్, భారత్‌కి చెందిన మొత్తం నాలుగు సంస్థలు విజేతలుగా నిల్చియి. వాటిలో లైఫ్‌ సర్కిల్‌ కూడా ఒకటి. ఇప్పటివరకు 5,000 మంది సంరక్షకులకు ప్లేస్‌మెంట్‌ కల్పించింది.


అనుబంధ సంస్థగా జియో పేమెంట్స్‌

ఎస్‌బీఐ వాటా జియో ఫైనాన్షియల్‌ చేతికి

జియో పేమెంట్స్‌ బ్యాంక్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ)కు గల మొత్తం 17.8 శాతం వాటాను జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 104.54 కోట్లు వెచ్చించినట్లు జియో ఫైనాన్షియల్‌ తాజాగా వెల్లడించింది. దీంతో జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించినట్లు పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి తదుపరి ఎస్‌బీఐ నుంచి 7,90,80,000 ఈక్విటీ షేర్లను రూ. 104.54 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement