వర్క్‌ ఫ్రమ్‌హోంలో ఉద్యోగులు..పెరిగిన సైబర్‌ దాడులు! | Companies Suffered Cyberattacks Due To Work From Home In 2021 | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రమ్‌హోంలో ఉద్యోగులు..పెరిగిన సైబర్‌ దాడులు!

Aug 3 2022 9:49 PM | Updated on Aug 3 2022 9:50 PM

Companies Suffered Cyberattacks Due To Work From Home In 2021 - Sakshi

గతేడాది కరోనా కారణంగా ఎక్కువ శాతం కంపెనీల కార్యకలాపాలన్నీ రిమోట్‌గానే నడిచాయి. దీంతో దేశంలో 45 శాతం సైబర్‌ క్రైం పెరిగాయని, ఈ ఏడాది 22శాతానికి పెరిగినట్లు వెరిజోన్‌ మొబైల్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌-2022 నివేదిచింది. 

సైబర్‌ దాడుల కారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువ ప్రభావితం అయ్యాయని తెలుస్తోంది. మూడు నుంచి ఐదు కంపెనీల వరకు 61 శాతం దెబ్బతిన్నాయని,  43 శాతం దేశీయ సంస్థలపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేరాలు ముఖ్యంగా ఆర్థిక సేవల్లో 93 శాతం, రిటైల్ 88 శాతం, ఆరోగ్య సంరక్షణ 87 శాతం, ప్రభుత్వ రంగం, విద్య 87 శాతం, తయారీ, నిర్మాణం, రవాణా రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.  

ఈ సందర్భంగా వెరిజోన్ బిజినెస్ సీఈఓ సంపత్ సౌమ్యనారాయణన్ మాట్లాడుతూ..రిమోట్‌ వర్క్‌ కారణంగా సంస్థలు సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా లేవని అన్నారు. కాబట్టే సైబర్‌ దాడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement