సరికొత్త ధోని ఎడిషన్.. కేవలం 100 మందికి మాత్రమే | Citroen C3 Aircross Dhoni Edition Launched In India | Sakshi
Sakshi News home page

సరికొత్త ధోని ఎడిషన్.. కేవలం 100 మందికి మాత్రమే

Published Fri, Jun 21 2024 6:53 PM | Last Updated on Fri, Jun 21 2024 7:14 PM

Citroen C3 Aircross Dhoni Edition launched in India

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సిట్రోయెన్ కంపెనీ ఇటీవల 'సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఈ కారును కంపెనీ 100 మందికి మాత్రమే పరిమితం చేసింది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధోని పేరు, 7 నెంబర్ వంటివి ఉండటం చూడవచ్చు.

సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్.. కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్‌లు, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డాష్ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారును కొనుగోలు చేసేవారు ధోని సంతకం చేసిన 'గ్లౌస్' పొందవచ్చు. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement