
హైదరాబాద్: స్కోడా ఆటో డీలర్‌షిప్ ‘మహావీర్ స్కోడా’ తెలుగు రాష్ట్రాల్లోని తమ షోరూంల్లో ఆల్‌న్యూ స్కోడా కోడియాక్ ఎస్‌యూవీల డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర రూ.46.89 లక్షలు. 2.0 లీటర్ టర్బో పె ట్రోల్ ఇంజిన్‌తో ఈ ఎస్‌యూవీ 14.86 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
పనోరమా సన్‌రూఫ్, 9 ఎయిర్‌బ్యాగులు, 1,976 లీటర్ల లగేజీ స్పేస్ కలిగి ఉంది. ఐదేళ్ల వారంటీ/1.25 లక్షల కి.మీ.., పదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఏడాది స్కోడా సూపర్‌కేర్ ప్యాకేజీ సౌకర్యాలున్నాయి. మహవీర్ స్కోడా షోరూంల్లో టెస్ట్‌డ్రైవ్‌తో బుకింగ్ సదుపాయం ఉంది.