
నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ను భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ .8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). నిస్సాన్ డీలర్షిప్లు, నిస్సాన్ ఇండియా వెబ్సైట్లో దీని బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ను బ్లాక్ కలర్ థీమ్ ఆధారంగా రూపొందించారు.
మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ఎక్స్టీరియర్ లో పియానో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, రెసిన్ బ్లాక్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, గ్లాస్ బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ వాహనం ఎడమ ఫెండర్ పై మాగ్నైట్ బ్రాండింగ్ కింద 'కురో' బ్యాడ్జ్ ను ఇచ్చారు.
ఈ మోడల్ లో బ్లాక్ డ్యాష్ బోర్డ్, పియానో బ్లాక్ గేర్ షిఫ్ట్ గార్నిష్, పియానో బ్లాక్ స్టీరింగ్ ఇన్సర్ట్, బ్లాక్ సన్ వైజర్స్, బ్లాక్ డోర్ ట్రిమ్స్ ఉన్నాయి. లైట్సాబర్ టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టాండర్డ్ సాబుల్ బ్లాక్ వైర్లెస్ ఛార్జర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ డిస్ప్లే ఉన్నాయి. డాష్ క్యామ్ ను యాక్ససరీగా అందిస్తున్నారు.
నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ పవర్ట్రెయిన్లు మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్లో లభిస్తాయి. 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (72 పీఎస్, 96 ఎన్ఎమ్) 5-స్పీడ్ ఎంటీ లేదా ఏఎంటీతో జత చేయవచ్చు. అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100 పీఎస్, 160 ఎన్ఎమ్)కు 5-స్పీడ్ ఎంటీ, సీవీటీ ఆప్షన్లు ఉంటాయి.