‘మాకు 5జీ ఫోన్‌లు కావాలి’, స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు

Centre Will Push Mobile Phone Manufacturers To Prioritize Rolling Out Software Upgrades To Support 5g - Sakshi

దేశంలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల తయారీని పెంచాలని, ప్రస్తుతం ఉన్న ఫోన్‌లను 5జీకి అప్‌ గ్రేడ్‌ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌లను డిజైన్‌ చేయాలని స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలైన యాపిల్‌, ​శాంసంగ్‌తో పాటు ఇతర కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  

అక్టోబర్‌ 1న జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2022 కార్యక్రమంలో ప్రధాని మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. ఈ ఫాస్టెస్ట్‌ నెట్‌వర్క్‌ సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభం అవ్వగా.. వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఈ సేవల్ని వినియోగించుకునే సౌలభ్యం కలగనుందని టెలికం సంస్థలు తెలిపాయి.  

చదవండి👉 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? 

అయితే 5జీ సేవలు ప్రారంభమైనా..వాటి వినియోగం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకంటే? 4జీ స్మార్ట్‌ ఫోన్‌లలో 5జీని ఉపయోగించుకునే వెసలుబాటు లేదు కాబట్టి. ఈ తరుణంలో కేంద్రం స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. 

5జీ ఫోన్‌లు కావాలి
ఈనేపథ్యంలో మంగళవారం.. కేంద్ర టెలికమ్యూనికేషన్లు, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల అధ్యతన  స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు యాపిల్‌,శాంసంగ్‌,వివో,షావోమీలతో పాటు దేశీయం టెలికం సంస్థలు రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోఫోన్‌ ఐడియాలతో సమావేశం జరిగింది. ఇందులో ఉన్నతాధికారులు.. ఫోన్‌ తయారీ కంపెనీలకు.. దేశంలో వీలైనంత త్వరగా 5జీ ఫోన్‌లను తయారు చేయడం, లేదంటే ప్రస్తుతం ఉన్న ఫోన్‌లనే 5జీని వాడుకునేలా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. 

నో 5జీ
ఎయిర్‌టెల్ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో యాపిల్‌ ఐఫోన్‌ సిరీస్‌ 12 నుండి 14 ఫోన్‌ల వరకు 5జీని వాడుకునేలా అప్‌గ్రేడ్‌ చేయలేదని స్పష్టం చేసింది. శాంసంగ్‌కు చెందిన ఎక్కువ శాతం ఫోన్‌లలో ఈ లేటెస్ట్‌ జనరేషన్‌ నెట్‌వర్క్‌ సదుపాయం లేదని పేర్కొంది. షావోమీ, వివోకు చెందిన మూడు డజన్లకు పైగా మోడల్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవల్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు హైలెట్‌ చేసింది.  

చివరిగా, టెలికాం కంపెనీలు, స్మార్ట్‌ఫోన్ సంస్థల మధ్య పరస్పరం చర్చలు జరుపుతున్నప్పటికీ, భారతదేశంలోని టెలికాం కంపెనీల నిర్దిష్ట 5జీ సాంకేతికత,ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ చేసేలా అప్‌గ్రేడ్‌ చేసేందుకు మరింత సమయం పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

చదవండి👉  ఫోన్‌ల జాబితా వచ్చేసింది, ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌ వర్క్‌ పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top