5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

Ru Buying New 5g Smartphone, Here Are Some Tips To Keep In Mind While Buying A New 5g Device  - Sakshi

‘ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌’ ఈవెంట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ నెట్‌వర్క్‌ ప్రారంభించారు. దీంతో దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు అధికారికంగా వినియోగించేకునే  సౌకర్యం కలిగింది. ప్రస్తుతం టెలికం సంస్థ ఎయిర్‌ టెల్‌ మాత్రమే ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5జీ సర్వీసుల్ని ప్రారంభించగా జియో, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌లు ఈ లేటెస్ట్‌ టెక్నాలజీ నెట్‌వర్క్‌లను వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. 

ఈ నేపథ్యంలో 5జీ నెట్‌ వర్క్‌ల పనితీరు, సిమ్‌లు, నెట్‌ వర్క్‌ ప్లాన్‌ ధరలు సంగతి పక్కన పెడితే..యూజర్లు 5జీ సపోర్ట్‌ చేసే ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నారు. అయితే రోజువారీ అవసరాల కోసం 5జీ నెట్‌ వర్క్‌ పనిచేసేలా స్మార్ట్‌ ఫోన్‌లలో ఏయే ఫీచర్లు ఉండాలనే విషయాల గురించి తెలుసుకుందాం. 

5జీ చిప్‌సెట్
5జీ నెట్‌వర్క్‌లకు సపోర్ట్‌ చేసేలా మీ ఫోన్‌లో తప్పని సరిగా 5జీ చిప్‌సెట్ ఉండాలి. ఇక్కడ శుభ పరిణామం ఏంటంటే? ఇప్పటికే తయారు చేసిన కొత్త చిప్‌సెట్‌లు మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ ఫోన్‌లకు 5జీ నెట్‌ వర్క్‌ సపోర్ట్‌ చేస్తున్నాయి. క్వాల్కమ్‌ ప్రాసెసర్‌ సపోర్ట్‌ చేసే ఫోన్‌లలో స్నాప్‌ డ్రాగన్ 695 , స్నాప్‌డ్రాగన్ 765జీ, స్నాప్‌డ్రాగన్ 865, చిప్‌ సెట్‌లు డిఫాల్ట్‌గా 5జీ నెట్‌ వర్క్‌కి మద్దతు ఇస్తాయి.

మీడియా టెక్‌ ప్రాసెసర్‌కు సపోర్ట్‌ చేసే ఫోన్‌లలో మీడియా టెక్‌ డైమెన్సిటీ సిరీస్ చిప్‌సెట్‌ ఉంటే 5జీ నెట్‌ వర్క్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో డైమెన్సిటీ 700 వంటి తక్కువ స్థాయి ఫోన్‌లు, అలాగే హై-ఎండ్ డైమెన్సిటీ 8100, డైమెన్సిటీ 9000 ఉన్నాయి. పాత జీ-సిరీస్, హీలియో సిరీస్ ఫోన్‌లు 5జీని వినియోగించుకోలేం. 

5G బ్యాండ్‌లు
స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌లకు సపోర్ట్‌ చేస్తుందా? లేదా? అనేది ఫోన్ చిప్‌సెట్ నిర్ణయిస్తుంది. అందుకే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏదైనా ఫోన్‌లో 5జీ బ్యాండ్‌లకు సపోర్ట్‌ చేస్తాయా? లేదా అనేది ఒక్కసారి చెక్‌ చేయండి. సంబంధిత కంపెనీ వెబ్‌సైట్‌లో డివైజ్‌ ప్రొడక్ట్‌ పేజీ విభాగంలో స్పెసిఫికేషన్‌ సెక్షన్‌లో బ్యాండ్‌ వివరాలు ఉంటాయి. 5జీ బ్యాండ్స్‌ 8-12 మధ్య ఉంటే సరిపోతుంది. వాటి పనితీరు బాగుంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top