సాక్షి మనీ మంత్ర : అవుట్‌ లుక్‌పైనే చూపు.. లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు | Business Consultant Karunya Rao About Stock Market Today - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : అవుట్‌ లుక్‌పైనే చూపు.. లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Aug 29 2023 9:30 AM | Updated on Aug 29 2023 10:08 AM

Business Consultant Karunya Rao about Stock Market Today - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని మదుపర్లు గ్లోబుల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ అవుట్‌ లుక్‌పై ఎలా ఉండబోతుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాటికి అనుగుణంగా యూఎస్‌ ఈక్విటీలను అనుసరిస్తున్నారు. షేర్ల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. 

ఈ తరుణంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో కొనసాగతున్నాయి. ఉదయం 9.20 గంటల సమయానికి 100 పాయింట్ల లాభంతో 65099 వద్ద, నిఫ్టీ అత్యంత స్పల 29 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. 

యూపీఎల్‌,సిప్లా, హీరో మోటో కార్ప్‌,హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, జేఎస్‌డ్ల్యూ స్టీల్‌,టాటా మోటార్స్‌, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, అపోలో హాస్పిటల్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement