బొండాడ ఇంజనీరింగ్‌కి రూ. 1,338 కోట్ల ఆర్డరు  | Bondada Bags Rs 1,338-Crore NTPC Renewable Energy Contract in UP | Sakshi
Sakshi News home page

బొండాడ ఇంజనీరింగ్‌కి రూ. 1,338 కోట్ల ఆర్డరు 

Jun 17 2026 1:59 AM | Updated on Jun 17 2026 1:59 AM

Bondada Bags Rs 1,338-Crore NTPC Renewable Energy Contract in UP

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ నుంచి భారీ కాంట్రాక్టు లభించినట్లు బొండాడ ఇంజినీరింగ్‌ వెల్లడించింది. దీని విలువ సుమారు రూ. 1,338 కోట్లని తెలిపింది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 250 మెగావాట్ల సోలార్‌ పీవీ ప్రాజెక్టు, 50 మెగావాట్ల/200 మెగావాట్‌హవర్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం (బీఈఎస్‌ఎస్‌) ఏర్పాటుకు సంబంధించి ఇది ఈపీసీ ప్యాకేజీ రూపంలో ఉంటుంది. నోటిఫికేషన్‌ ఆఫ్‌ అవార్డు (ఎన్‌వోఏ) లభించినప్పటి నుంచి 18 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ వివరించింది.  

మంగళవారం బీఎస్‌ఈలో బొండాడ ఇంజనీరింగ్‌ షేరు 4% పెరిగి రూ. 343.50 వద్ద క్లోజయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement