కెనడాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!

Big Relief Undocumented Immigrants In Canada - Sakshi

2024 ఆగస్ట్‌ నెల సమయానికి కెనడా ఆర్ధిక మాంద్యంలోకి జారిపోనుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత కుంటుపడనుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, డాలర్‌ విలువ మరింత పడిపోవడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో దేశ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు భారీ ఊరట కలగనుంది.

ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించేందుకు కెనడా నడుం బిగించింది.  నిబంధనలు పాటిస్తున్నా.. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే.. ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడేలా వారందరికి పౌరసత్వం ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. 


 
ఆర్ధిక వ్యవస్థకు ఊతంగా 
2025 నాటికి 5 లక్షల మందికి వలసదారులకు తమ దేశానికి ఆహ్వానిస్తామని అన్నారు. జనాబా పెరిగే కొద్ది దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

3 నుంచి 5 లక్షల మంది వలస దారులకు
పలు నివేదికల ప్రకారం.. కెనడాలో సరైన పత్రాలు లేకుండా 3 లక్షల నుంచి 6 లక్షల మంది జీవిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఆ డాక్యుమెంట్లు నిర్ణీత సమయానికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వారు సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. 

వారికి మాత్రం ఇబ్బందే 
అయితే కెనడా త్వరలో అమలు చేయనున్న వీసా నిబంధనలతో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారులకు, తాత్కాలికంగా నివసిస్తూ వీసా గడువు ముగియనున్న  వర్కర్లకు, విద్యార్ధులకు మరింత లబ్ధి చేకూరనుంది. కానీ, ఇటీవల దేశంలోకి ప్రవేశించిన వారికి ఈ కార్యక్రమం అందుబాటులో ఉండదని మంత్రి మిల్లర్ స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు లేని వలసదారులు సిటిజన్‌ షిప్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందేలా రాబోయే క్యాబినెట్ సమావేశాల్లో బిల్లుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

వలసదారులకు ఆహ్వానం
హౌసింగ్ సవాళ్లు, పెరిగిన ద్రవ్యోల్బణ రేట్ల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ ఆర్థిక ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుత వలస లక్ష్యాలను రాబోయే రెండు సంవత్సరాలకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023 లో 465,000 కొత్త నివాసితులు, 2024 లో 485,000 కొత్త నివాసితులు, 2025 లో 500,000 మందిని ఆహ్వానించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top