డిఫెన్స్‌ బలగాల కోసం బజాజ్‌ ‘ప్రోషీల్డ్‌’ వాహన బీమా  | Bajaj General Insurance Launches Special Motor Cover 'ProShield' for Defence Personnel | Sakshi
Sakshi News home page

డిఫెన్స్‌ బలగాల కోసం బజాజ్‌ ‘ప్రోషీల్డ్‌’ వాహన బీమా 

Aug 17 2026 6:13 AM | Updated on Aug 17 2026 11:31 AM

Bajaj General Insurance rolls out special motor cover for defence

బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా రక్షణ బలగాల కోసం ప్రోషీల్డ్‌ పేరిట వాహన బీమాను ప్రవేశపెట్టింది. పోస్టింగ్‌ల మధ్య  వాహనాల రీలొకేషన్‌ సమయంలో ఏవైనా ప్రమాదాలు తలెత్తితే పరిహారం, డ్రైవింగ్‌ లైసెన్స్‌లాంటివి పోగొట్టుకుంటే వాటిని తిరిగి సమకూర్చుకునేందుకు ఆర్థిక తోడ్పాటు, విమానాశ్రయాలకు ప్రయాణించేటప్పుడు వాహన ప్రమాదాల బారిన పడటం వల్ల ఫ్లయిట్స్‌ మిస్‌ కావడం, హోటల్‌ బస వ్యయాలు మొదలైన వాటికి ట్రావెల్‌ ఎమర్జెన్సీ ప్రొటెక్షన్‌ కింద రీయింబర్స్‌మెంట్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రీడ్‌ వాహనాల విషయంలో వివిధ రకాల స్టాండెలోన్‌ యాడ్‌–ఆన్‌ కవర్స్‌ను ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా మరిన్ని కొత్త ఫీచర్లతో వీపే 2.0 పథకాన్ని కూడా సంస్థ ఆవిష్కరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement