2020లో ఎంజీ మోటార్ కంపెనీ.. జెడ్ఎస్ ఈవీ కారును లాంచ్ చేయడంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ సంస్థ ఒక లక్ష కంటే ఎక్కువ ఈవీలను విక్రయించి, అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నట్లు JSW MG మోటార్ ఇండియా ప్రకటించింది.
ప్రారంభంలో జెడ్ఎస్ ఈవీను లాంచ్ చేసిన.. ఎంజీ మోటార్ కంపెనీ, ఇప్పుడు కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీలను లాంచ్ చేసి, మార్కెట్లో విక్రయిస్తోంది. ఇవి కూడా ప్రతి నెలా ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో.. ప్రస్తుతం 70-80 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది.
భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 26 శాతం వాటాను కలిగిన ఎంజీ మోటార్ 2024 చివరి నాటికి 34 శాతానికి పెరిగింది. కాగా కంపెనీ 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26640 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇది అంతకు, ముందు సంవత్సరంతో పోలిస్తే 220 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
ఇదీ చదవండి: ఎయిర్‌బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!
ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో.. జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీ వంటివి మాత్రమే కాకుండా, ఎం9 అనే ప్రీమియం ఎంపీవీ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 69.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల అమ్మకాలను ఇది దోహదపడనప్పటికీ.. లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.


