ఐఫోన్ 16 కొనడానికి మంచి తరుణం.. | Apple iPhone 16 Price Slashed On Flipkart, Get It For Rs 62,999 With Additional Discounts, Check Out More Details | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 16 కొనడానికి మంచి తరుణం..

Nov 8 2025 6:28 PM | Updated on Nov 8 2025 8:02 PM

Apple iPhone 16 Price Drops By Rs 19000 On Flipkart

మార్కెట్లో యాపిల్ ఐఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతి ఏటా కొత్త మోడల్ లాంచ్ చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఐఫోన్ 17 పేరుతో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌ అత్యుత్తమ అమ్మకాలను పొందుతోంది. ఈ సమయంలో ఐఫోన్ 16 మోడల్ ధర కొంత వరకు తగ్గింది. అంతే కాకుండా.. ఐఫోన్ 16 కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ గొప్ప ఆఫర్‌ కూడా తీసుకొచ్చింది.

యాపిల్ ఐఫోన్ 16 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79900. కానీ ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 62,999లకే లభిస్తుంది. ఇంకా.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డులు ఉన్న వినియోగదారులందరూ ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.2,500 తగ్గింపును పొందుతారు. ఈ ఫోన్ బ్లాక్, పింక్, అల్ట్రామెరైన్, వైట్, టీల్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్స్
యాపిల్ ఐఫోన్ 16.. 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో జత చేయబడిన ఆపిల్ A18 ప్రాసెసర్‌ పొందుతుంది. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం ఐపీ68 ధృవీకరణను పొందుతుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్లతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు 12MP ఫ్రంట్ స్నాపర్‌ను పొందుతుంది. ఇది 3561mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.

ఇదీ చదవండి: అమల్లోకి IRCTC కొత్త రూల్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement