హురున్‌ మహిళా లీడర్లలో ‘అపోలో’ సిస్టర్స్‌  | Apollo Sisters Among Hurun Women Leaders 2026 | Sakshi
Sakshi News home page

హురున్‌ మహిళా లీడర్లలో ‘అపోలో’ సిస్టర్స్‌ 

Jul 31 2026 6:05 AM | Updated on Jul 31 2026 6:39 AM

Apollo Sisters Among Hurun Women Leaders 2026

వెటరన్స్‌ కేటగిరీలో ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డికి అగ్రస్థానం 

న్యూఢిల్లీ: క్యాండియర్‌ హురున్‌ ఇండియా 2026 మహిళా లీడర్ల జాబితాకి సంబంధించి వెటరన్స్‌ విభాగంలో రూ. 1,21,000 కోట్లకు పైగా వేల్యుయేషన్‌ గల అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌నకు చెందిన ప్రీతా రెడ్డి (68), సునీతా రెడ్డి (67) సంయుక్తంగా అగ్రస్థానం దక్కించుకున్నారు. వెల్త్‌ మలి్టప్లయర్‌ విభాగంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ టాప్‌లో నిల్చారు. 

మరోవైపు, రూ.5,06,600 కోట్ల విలువైన కంపెనీ హిందుస్తాన్‌ యూనీలివర్‌ సీఈవో ప్రియా నాయర్‌.. ప్రొఫెషనల్‌ సీఈవోల కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఈసారి 117 మంది స్థానం దక్కించుకున్నారు. గతేడాది లిస్టులోని 97 మందితో పోలిస్తే ఇది 21 శాతం అధికం. ఈ లిస్టులో చోటు లభించిన వారి సంస్థల మొత్తం వేల్యుయేషన్‌ రూ.39 లక్షల కోట్ల పైమాటే. ఇది ఫిన్లాండ్‌ జీడీపీ కన్నా అధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement