స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఇంత కంటే గొప్పగా చెప్పలేరేమో! | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఇంత కంటే గొప్పగా చెప్పలేరేమో!

Published Tue, Aug 15 2023 7:26 PM

Anand Mahindra Shares Video Of Tribute To Independence Day - Sakshi

ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా తన రోజూవారీ పనుల్లో తలమునకలవుతున్నా సరే సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సందర్భాను సారం ఆసక్తికరమైన పోస్ట్‌లను అప్‌డేట్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటారు. తాజాగా,  భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఓ వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. 

ఇక ఆ వీడియోలో సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మంగా భావించే మూడు గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న భారత్‌కు చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌ రిక్కీ కేజ్‌ జనగణమన అధినాయక జయహే అంటూ జాతీయ గీతాన్ని తన మ్యూజిక్‌ బృందంతో అలపించారు. 

ఇంగ్లాండ్‌లో అబ్బే రోడ్ స్టూడియోస్ అనే రికార్డింగ్‌ స్టూడియోలో నివాళులర్పించిన రిక్కీ కేజ్‌ వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..ఇలా ఇంతకన్నా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేరేమో అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 
Advertisement
 
Advertisement