అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో.. | Anand Mahindra Reacts To Pics Of Japanese Style Pod Hotel In Noida, Check Out More Details | Sakshi
Sakshi News home page

అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..

Sep 26 2024 2:42 PM | Updated on Sep 26 2024 3:49 PM

Anand Mahindra Reacts To Pics Of Japanese Style Pod Hotel

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రెట్టీ కూల్ అంటూ కొన్ని ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే.. వాషింగ్ మెషీన్‌లో మహిళా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదొక పాడ్-స్టైల్ హోటల్‌. ఇలాంటి టెక్నాలజీ మొదటిసారిగా 1979లో జపాన్‌ పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు నోయిడాలో కనిపించింది.

ఇదీ చదవండి: మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..

ట్రావెల్ వ్లాగర్ ఇందులో ఉండటానికి రూ. 1000 చెల్లించి, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే గడిపింది. ఇందులో ఒక మంచం, అద్దం, కంట్రోల్ ప్యానెల్, ఛార్జింగ్ పాయింట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి వాటితో పాటు మహిళల కోసం ప్రత్యేకమైన వాష్‌రూమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ప్రెట్టీ కూల్ అంటూ అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement