అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా | Ambani family sweet moments at friends wedding | Sakshi
Sakshi News home page

అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా

Jun 11 2025 5:47 PM | Updated on Jun 11 2025 6:26 PM

Ambani family sweet moments at friends wedding

ఎప్పుడూ వ్యాపారాలపరంగా వార్తల్లో నిలిచే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.

కొడుకు, కోడళ్ల స్నేహితుడి పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవడమే కాదు.. అందరూ హుషారుగా డ్యాన్స్‌లు వేశారు. శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది. ఇక ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

👉ఇది చదివారా? అనిల్‌ అంబానీకి భారీ ఉపశమనం

స్కూల్‌ ఫ్రెండ్స్‌ అయిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా చాలా ఏళ్ల సుదీర్ఘ స్నేహం తరువాత 2019లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు 2018లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జేఐఎల్) చైర్మన్‌గా ఉండగా, శ్లోకా దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement