అనిల్‌ అంబానీకి భారీ ఉపశమనం | Anil Ambani Gets Big Win NCLAT Halts Reliance Infra Insolvency | Sakshi
Sakshi News home page

అనిల్‌ అంబానీకి భారీ ఉపశమనం

Jun 8 2025 10:10 AM | Updated on Jun 8 2025 10:47 AM

Anil Ambani Gets Big Win NCLAT Halts Reliance Infra Insolvency

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్‌ మేరకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది.  

తమకు సౌర విద్యుత్‌ సరఫరా చేసిన ధుర్సర్‌ సోలార్‌ పవర్‌కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్‌కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్‌ సర్వీసెస్‌ సంస్థ 2022 ఏప్రిల్‌లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై కార్పొరేట్‌ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.

దీనితో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై ఎన్‌సీఎల్‌టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్‌ సోలార్‌ పవర్‌కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్‌లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement