breaking news
Friends wedding
-
అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా
ఎప్పుడూ వ్యాపారాలపరంగా వార్తల్లో నిలిచే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.కొడుకు, కోడళ్ల స్నేహితుడి పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవడమే కాదు.. అందరూ హుషారుగా డ్యాన్స్‌లు వేశారు. శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది. ఇక ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.👉ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనంస్కూల్ ఫ్రెండ్స్ అయిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా చాలా ఏళ్ల సుదీర్ఘ స్నేహం తరువాత 2019లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు 2018లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) చైర్మన్‌గా ఉండగా, శ్లోకా దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by The Wedding Anchor Junaid Arif Currimbhoy (@theweddinganchor) -
కోతిరూపంలో దూసుకొచ్చిన మృత్యువు
మెదక్ రూరల్ : స్నేహితుడి పెళ్లికి భార్యా పిల్లలతో కలిసి బైక్‌పై వెళుతుండగా కోతి రూపంలో మృత్యువు ఒకరిని కబలించింది. ఈ సంఘటన మండల పరిధిలోని చేగుంట - మెదక్ ప్రధాన రహదారి ఖాజీపల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన దానయ్య 15 ఏళ్ల క్రితం మండల పరిధిలోని అవుసులపల్లి గ్రామానికి వలస వచ్చి పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ భార్యాపిల్లలతో ఇక్కడే నివాసముంటున్నాడు. కాగా తాను పని చేసే కంపెనీలో ఓ స్నేహితుడి వివాహం గురువారం చేగుంటలో జరుగుతుండడంతో దానయ్య, అత డి భార్య దనావత్ త్రివేణి (30)తో పాటు పదేళ్ల ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలతో సహా బైక్‌పై వెళుతున్నాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఖాజీపల్లి బస్‌స్టాప్ సమీపంలోకి రాగానే కోతి అడ్డు వచ్చింది. దీంతో దానయ్య సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చొన్న త్రివేణి ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో త్రివేణి తలకు బలమైన గాయాలై నిమిషాల వ్యవధిలో మృతి చెందింది. అయితే తల్లి మరణంతో పిల్లలు తల్లడిల్లిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.