కోతిరూపంలో దూసుకొచ్చిన మృత్యువు | emanating death form of Monkey | Sakshi
Sakshi News home page

కోతిరూపంలో దూసుకొచ్చిన మృత్యువు

Aug 21 2014 11:58 PM | Updated on Sep 2 2017 12:14 PM

స్నేహితుడి పెళ్లికి భార్యా పిల్లలతో కలిసి బైక్‌పై వెళుతుండగా కోతి రూపంలో మృత్యువు ఒకరిని కబలించింది.

మెదక్ రూరల్ : స్నేహితుడి పెళ్లికి భార్యా పిల్లలతో కలిసి బైక్‌పై వెళుతుండగా కోతి రూపంలో మృత్యువు ఒకరిని కబలించింది. ఈ సంఘటన మండల పరిధిలోని చేగుంట - మెదక్ ప్రధాన రహదారి ఖాజీపల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన దానయ్య  15 ఏళ్ల క్రితం మండల పరిధిలోని అవుసులపల్లి గ్రామానికి వలస వచ్చి పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ భార్యాపిల్లలతో ఇక్కడే నివాసముంటున్నాడు.

కాగా తాను పని చేసే కంపెనీలో ఓ స్నేహితుడి వివాహం గురువారం చేగుంటలో జరుగుతుండడంతో దానయ్య, అత డి భార్య దనావత్ త్రివేణి (30)తో పాటు పదేళ్ల ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలతో సహా బైక్‌పై వెళుతున్నాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఖాజీపల్లి బస్‌స్టాప్ సమీపంలోకి రాగానే కోతి అడ్డు వచ్చింది. దీంతో దానయ్య సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చొన్న త్రివేణి ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో త్రివేణి తలకు బలమైన గాయాలై నిమిషాల వ్యవధిలో మృతి చెందింది. అయితే తల్లి మరణంతో పిల్లలు తల్లడిల్లిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement