Sakshi News home page

దూసుకెళ్లిన షేర్లు.. 13లక్షల కోట్లకు చేరిన అదానీ గ్రూప్‌ కంపెనీల విలువ!

Published Tue, Dec 5 2023 9:36 PM

Adani Group Market Cap Crosses Rs.13 Lakh Crore - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్లు అదరగొట్టేస్తున్నాయి. డిసెంబర్‌ 5న ఆ గ్రూప్‌కి చెందిన అన్నీ షేర్ల విలువ 20 శాతానికి ఎగబాకాయి. హిండేన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ .. అదానీ పోర్ట్‌ మోసాలకు పాల్పడుతుందంటూ చేసిన ఆరోపణల్ని అమెరికా ఏజెన్సీ వ్యతిరేకించడం.. అదానీ గ్రూప్‌ కంపెనీలకు కలిసి వచ్చింది. 

అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫినాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీ) శ్రీలంకలో నిర్మించనున్న కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి 553 మిలియన్ల రుణాల్ని అదానీ గ్రూప్‌కు మంజూరు చేయాల్సి ఉంది. అంతకంటే ముందే హిండేన్‌ బర్గ్‌ చేస్తున్న ఆరోపణలు నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు దర‍్యాప్తు చేపట్టింది. 

ఇందులో భాగంగా రంగంలోకి దిగిన అమెరికా ప్రభుత్వ అధికారులు అదానీ గ్రూప్‌పై విడుదల చేసిన హిండేన్‌ బర్గ్‌ రిపోర్ట్‌లపై దర్యాప్తు చేపట్టారు. అధికారుల దర్యాప్తులో శ్రీలకంలో నిర్మించబోయే కంటైనర్‌ టెర్మినల్‌లో అదాని గ్రూప్‌ ఎలాంటి కార్పొరేట్‌ మోసాలకు పాల్పడలేదని గుర్తించారు. హిండేన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయని నిర్ధారిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. 

ఆ నివేదిక వెలుగులోకి రావడంతో అదానీ గ్రూప్‌ షేర్ల కొనుగోళ్లు విజృంభించాయి. ఫలితంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర‍్ల విలువ 10 శాతం పెరిగి రూ.2,784 వద్దకు చేరాయి. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్‌ కేపిటల్‌ విలువ 3లక్షల కోట్లకు చేరింది. 54 వారాల లో సర్క్యూట్‌ తర్వాత అదానీ షేర్లు 173 శాతానికి ఎగబాకాయి. 

దీంతో పాటు అదానీ గ్రూన్‌ ఎనర్జీ షేర్లు 17 శాతం, అలాగే అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ 9 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 10 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 7శాతం, అదానీ పవర్‌ 7శాతం, అదానీ విల్మర్‌ 5శాతం, అంబుజా సిమెంట్స్‌ 5శాతం, ఏసీసీ 6శాతం, ఎన్డీటీవీ 7శాతం చొప్పున లాభపడ్డాయి. మొత్తంగా అదానీ గ్రూప్‌ కంపెనీల విలువ రూ.14 లక్షల కోట్లు దాటింది.

Advertisement

What’s your opinion

Advertisement